AP Assembly Sessions : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాల అంశంపై అధికార, ప్రతిపక్షాల నడుమ తీవ్ర స్థాయి వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎమ్మెల్సీల తీరుపై రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ లేదా మండలి సమావేశాలు ప్రతిపక్షం ఇష్టానుసారంగా నడవడం కుదరదని, సభను ఎలా నడపాలనేది ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగా నిర్ణయమవుతుందని తేల్చిచెప్పారు. సభా వేదికగా వైసిపి సభ్యులు అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎండగడుతూ, “రా.. నువ్వు వచ్చి కూర్చొని చెప్పు” అంటూ మంత్రి పయ్యావుల ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
AP CM Chandrababu Meeting with MLAsప్రభుత్వ స్పష్టత: సభలో ఏ చర్చకైనా సిద్ధం
సభలో ఏ అంశంపై ఎప్పుడు చర్చ జరగాలనేది ప్రభుత్వ విచక్షణ, ప్రాధాన్యతలకు సంబంధించిన విషయమని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. డీఎస్సీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడటం లేదని, పూర్తి సమాచారంతో వివరంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. కేవలం రాజకీయం చేయడానికే వైసిపి ప్రతిరోజూ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని మండిపడ్డారు. ప్రభుత్వం నియమావళి ప్రకారమే నడుస్తుందని, వైసిపికి నచ్చినట్లు సభను శాసించాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
'స్థానిక' ఎన్నికలు.. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

