Medak District Yoga Program: మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం ఇందిరా గాంధీ స్టేడియంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' హెల్త్ వీక్ లో భాగంగా.
యో గా కార్యక్రమం ,ప్రపంచ హోమియోపతి ( ఆయుష్ డే ) కు జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అదనపు కలెక్టర్ నగేష్ , మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ , డి సి హెచ్ ఎస్ డాక్టర్ శివ దయాల్ , మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, డీఎస్పీ ప్రసన్నకుమార్ , జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి వశిష్ట యోగా కేంద్రం ప్రసిద్ధ యోగా గురువులు ఆకుల రవి, పతంజలి యోగ గురువు మనోరంజని, తో కలిసి హాజరై కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read also: Palla Rajeshwar Reddy: సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే


యోగా గురువు ఆకుల రవి అధికారులతో ఆసనాలు చేయించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం ఆయుష్ సిబ్బంది, క్రీడాకారులు క్రీడాభిమానులతో కలిసియోగాసనాలు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ వయో, లింగ భేదం లేకుండా అందరూ యోగాను సాధన చేయాలన్నారు..పురాతన కాలం నుం చి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, మా నవ శక్తులన్నింటినీ ఏకం చేసి ఏకాగ్రత సాధించడం యోగాకే సాధ్యమన్నారు.
Medak District Yoga Program: Complete Health with Yoga
యోగ అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సాధనంగా గుర్తించబడిందని, రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, శరీరానికి శక్తి మరియు మనసుకు ప్రశాంతత లభిస్తాయని, యోగా మన శరీరానికి, మనసుకు సమతుల్యతను అందించే సాధనమని తెలిపారు. యోగా సాధన ద్వారా జీవనశైలిలో మార్పు వస్తుందని, అనేక వ్యాధులను నివారించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మరియు వృద్ధులు యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇతర శాఖల అధికారులు పతంజలి, వశిష్ట యోగా సంస్థ ప్రతినిధులు, క్రీడాకారులు ఇతర ప్రభుత్వ విద్యార్థినిలు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

