Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యోగాతో సంతానలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చా ?

యోగాతో సంతానలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చా ?

వార్త 1 month ago

Yoga : ప్రస్తుత ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఈ సమస్యకు యోగా ద్వారా సులువైన పరిష్కారం లభిస్తుందని ప్రముఖ వైద్య సంస్థ 'ఎయిమ్స్' (AIIMS) పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.

క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల పురుషులలో వీర్యకణాల నాణ్యత (Sperm Quality) గణనీయంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతిష్టాత్మక ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా’లో ప్రచురించారు. యోగా కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని ఈ స్టడీ స్పష్టం చేస్తోంది.

వారంలో 5 రోజులు గంట చొప్పున.. అద్భుత ఫలితాలు!

ఈ పరిశోధన ప్రకారం.. వారంలో కనీసం ఐదు రోజుల పాటు, రోజుకు ఒక గంట సమయాన్ని యోగాకు కేటాయించడం వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో భాగంగా కేవలం ఆసనాలు మాత్రమే కాకుండా, ప్రాణాయామం వంటి బ్రీత్ ఎక్సర్‌సైజ్‌లు (శ్వాస సంబంధిత వ్యాయామాలు), మెడిటేషన్ (ధ్యానం) కలగలిపి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది మరియు మానసిక ఒత్తిడి (Stress) తగ్గి పునరుత్పత్తి ఆరోగ్యం (Reproductive Health) మెరుగుపడుతుంది. సంతానలేమి సమస్యతో సతమతమవుతున్న పురుషులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక సహజసిద్ధమైన ఔషధంగా యోగా ఉపయోగపడుతుందని ఈ అధ్యయనం నిరూపించింది.

స్కిన్ గ్లో కోసం 6 సూపర్ న్యూట్రియెంట్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha