Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
YSR చివరి కోరికను నెరవేరుద్దాం అని సీఎం రేవంత్ పిలుపు

YSR చివరి కోరికను నెరవేరుద్దాం అని సీఎం రేవంత్ పిలుపు

వార్త 2 weeks ago

YSR : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని రైతుల గుండెల్లో రారాజుగా నిలిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.

ఢిల్లీలో నిర్వహించిన వైఎస్సార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయాలు, రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన జీవితంలో మిగిలివున్న ఏకైక లక్ష్యమని వైఎస్సార్ స్పష్టం చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌కి మనం ఇచ్చే నిజమైన నివాళి ఆయన ఆఖరి కోరికను నెరవేర్చడమేనని, రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాహుల్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష

ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం అత్యంత ఆవశ్యకమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల సంక్షేమం, భద్రత మరియు సమగ్ర అభివృద్ధికి రాహుల్ గాంధీ వంటి సమర్థవంతమైన, బలమైన నాయకుని అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన ప్రజా సంక్షేమ బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని, ఆయన ఆశయ సాధనలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించాల్సి ఉందన్నారు. వైఎస్సార్ కలలుగన్న ప్రజా రంజక పాలనను దేశవ్యాప్తంగా అందివ్వాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావడం చారిత్రక అవసరమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha