Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యుద్ధానికి ముగింపు పలుకుదాం.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ

యుద్ధానికి ముగింపు పలుకుదాం.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు జెలెన్‌స్కీ బహిరంగ లేఖ

వార్త 2 months ago

Zelensky: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి తెరదించే దిశగా ఒక అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఈ సంక్షోభాన్ని ముగించడం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నేరుగా ముఖాముఖి చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రతిపాదించారు.

ఈ మేరకు ఆయన పుతిన్‌కు ఒక ఓపెన్ లెటర్ (బహిరంగ లేఖ) రాశారు. ఆ లేఖ రష్యా అధ్యక్షుడికి చేరిందని, దాన్ని ఆయన పూర్తిగా చదివారని రష్యా అధికారిక నివాసం 'క్రెమ్లిన్' స్పష్టం చేసింది. సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరమ్ (SPIEF) సమావేశాల సందర్భంగా పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ కీలక వివరాలను ధృవీకరించినట్లు రష్యా వార్తా సంస్థ ‘టాస్’ పేర్కొంది.

 RussiaUkraineWar

Read also: UNO Rules: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలు: పాక్ పదవీకాలం ముగింపు

ముఖాముఖి మాట్లాడుకుందాం.. జెలెన్‌స్కీ ప్రతిపాదనలు ఇవే!

“మనమిద్దరం నేరుగా సమావేశమై చర్చలు జరపడం ద్వారానే ఈ రణరంగానికి ముగింపు పలకగలం. ఇందుకోసం ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను” అని జెలెన్‌స్కీ తన లేఖలో పేర్కొన్నారు. ఐరోపా దేశాలు మళ్లీ ఈ యుద్ధం వైపు చూసేవరకు సమయాన్ని వృధా చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక శాంతి చర్చలకు వేదికగా నిలిచేందుకు టర్కీ, స్విట్జర్లాండ్ లేదా అరబ్ దేశాలు ముందుకు రావాలని, చర్చల కోసం ఒక ఖచ్చితమైన గడువు లేదా తేదీని ఖరారు చేసుకోవాలని పుతిన్‌ను కోరారు.

Zelensky: చర్చలు ముగిసేవరకు కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే

ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సంప్రదింపులు జరిగేంత వరకు యుద్ధాన్ని పూర్తిగా ఆపేందుకు (కాల్పుల విరమణ) ఉక్రెయిన్ కట్టుబడి ఉంటుందని జెలెన్‌స్కీ లేఖలో హామీ ఇచ్చారు. “శాంతి స్థాపనకు ఇదొక సరైన మార్గం. ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్థం చేసుకోవాలంటే యుద్ధభూమిలో నిశ్శబ్దం అవసరం. ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే కాదు, శాంతిని సాధించాలనే నిజమైన సంకల్పం మీకు ఉంటే.. ఇది ఖచ్చితంగా విజయవంతమైన కాల్పుల విరమణ అవుతుంది” అని ఆయన వివరించారు. ఈ లేఖపై ప్రపంచ దేశాల నాయకులు ఎలా స్పందిస్తున్నారనే సమాచారాన్ని కూడా తాము పుతిన్ దృష్టికి తీసుకెళ్లామని పెస్కోవ్ వెల్లడించారు.

రష్యా స్పందన: పుతిన్ చర్చలకు ఎప్పుడూ సిద్ధమే.. కానీ!

ఈ సరికొత్త పరిణామంపై డిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌తో మళ్లీ శాంతి చర్చలు ప్రారంభించాలని రష్యా కూడా బలంగా కోరుకుంటోందని అన్నారు. “ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న ప్రతిష్టంభన త్వరలోనే తొలిగిపోయి, సంప్రదింపుల ప్రక్రియ మళ్లీ పునఃప్రారంభం అవుతుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే అమెరికాతో వివిధ రకాలుగా చర్చలు జరుగుతున్నాయి” అని ఆయన తెలిపారు. పుతిన్ ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉంటారని, రష్యాతో మాట్లాడకూడదనే నిబంధనలను యూరప్ దేశాలు పక్కనబెట్టి, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలని చెప్పారు. అయితే, ఉక్రెయిన్‌తో ఉన్న వివాదాలు చాలా సున్నితమైనవి మరియు సంక్లిష్టమైనవని, అందువల్ల దీనికి అంత సులభంగా పరిష్కారం దొరకకపోవచ్చని పెస్కోవ్ అభిప్రాయపడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ట్రంప్ ను శాంతిదూతగా అభివర్ణించిన షరీఫ్‌..నిధుల కోసం కొత్త డ్రామా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha