Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యుద్ధం ప్రపంచశాంతికి ప్రమాద సంకేతం

యుద్ధం ప్రపంచశాంతికి ప్రమాద సంకేతం

వార్త 2 months ago

War: అమెరికా ఎప్పుడు ఏది చేసినా అది తమ దేశానికే కాదు ప్రపంచానికి ప్రమాదకరం అని మరోమారు రుజు వైంది. తాజాగా ట్రంప్ దుందుడుకు విధానాల వల్ల ప్రపంచం దాని మూల్యం చెల్లించుకుంటోంది.

ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తాం, నాగరికతే లేకుండా చేస్తామంటూ గర్జించిన అమెరికా చివరకు ఇరాన్తో కాళ్లబేరానికి వచ్చింది. తొలిసారిగా ఎప్పుడైతే ఐదురోజులపాటు కాల్పుల విరమణ అందో ఆ రోజే ఓడిపోయింది. సీజ్ ఫైర్ తర్వాత తాజాగా అమెరికా షరతులను ఇరాన్ ఒప్పుకోవడం లేదు కానీ, ఇరాన్ షరతులను మాత్రం అమెరికా ఒప్పుకుంటోంది. యుద్ధానికి వెళ్లి నప్పుడు గెలిచిరావాలి. లేదంటే ఓడి రావాలి. కానీ అమెరికా తెలివిగా కాల్పుల విరమణ పేరుతో ఒప్పందాలు కుదుర్చు కొని ఎస్కేప్ అవుతుంటుంది. అంటే ఎక్కడా అమెరికా ఓడిపోయింది అనే పేరు రాకుండా చూసుకోవడానికి, తన గౌరవానికి భంగం వాటిల్లకుండా, ప్రపంచ దేశాల్లో చులకన కాకుండా ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటుంది.

Read Also : Iran-America War: ఇరాన్ పోర్ట్ దిగ్బంధన ప్రణాళికను విరమించుకోవాలని అమెరికాపై సౌదీ అరేబియా ఒత్తిడి

 war

war: భరించలేనంత స్థాయికి యుద్ధ వ్యయం

అగ్రరాజ్యం అమెరికా అంటే అత్యాధునిక ఆయుధాలుంటాయి. సమర్థ వంతమైన గూఢచారి వ్యవస్థ ఉంటుంది. బిన్లాడెన్ లాంటి వారిని పాకిస్థాన్ దేశానికి కూడా తెలియకుండా ఆ దేశంలో కి వెళ్లి చంపిరాగల రాటుదేలిన బృందాలున్నాయి. అద్భుత మైన రక్షణ వ్యవస్థను నడిపించే పెంటగాన్ ఉంది. అమెరికా అంటే అందరూ అమ్మో అనుకుంటారు. కానీ అవన్నీ కేవ లం ఎండమావిలాంటివే. ఎందుకంటే అమెరికా కేవలం యుద్ధం అంటే గర్జనలకే పరిమితమవుతుంది కానీ ఆయుదాన్ని గెలవలేదు. మధ్యలోనే ఒప్పందాలు కుదుర్చుకొని వెనక్కి తిరిగివచ్చేస్తుంది. దీనికి కారణం ఆ దేశంలో భరించలేనంత స్థాయికి యుద్ధ వ్యయం పెరుగుతుంది. రెండు దశాబ్దాలకుపైగా సైనిక చర్యల కోసం అమెరికా దాదాపు 5.8 ట్రిలియన్ డాలర్లు ఖర్చుపెట్టినట్లు నివేదికలు వెల్లడి స్తున్నాయి. వీటితోపాటు రానున్న రోజుల్లో మాజీ సైనికుల ఆరోగ్య సంరక్షణ కోసం మరో 2.2 ట్రిలియన్ డాలర్లు అవ సరం అవుతాయని తెలుస్తోంది. మొత్తంగా 2001 నుంచి యుద్ధాలపై అమెరికా పెట్టే ఖర్చు సుమారు ౮ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెబుతున్నారు.

వేల సంఖ్యలో ప్రాణ నష్టం

రెండున్నర దశా బ్దాల్లో అమెరికా యుద్ధాల కారణంగా దాదాపు తొమ్మిదిలక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీరి లో దాదాపు సగం మంది సామాన్యులేనని చెప్పింది. ఆహారం, వైద్యం, యుద్ధ సంబంధిత వ్యాధులతో అనేక మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా చరిత్ర లో వియత్నాం యుద్ధం ఒక మాయనిమచ్చ. దశాబ్ద కాలం పోరాడినా కమ్యూనిజాన్ని ఆపలేక, స్వదేశంలో ప్రజల నిరసనలు, ఆర్థిక భారం పెరగడంతో వెనక్కి తగ్గింది. అంటే ఒకరకంగా ఓడిపోయి వెను తిరిగివచ్చింది. 2001 నుంచి 2021 వరకు 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేసి, చివరకు తాలిబన్లకే అధికారం అప్ప గించి అమెరికా వెనుతిరిగింది. ఇదొక అంతులేని యుద్ధం. అందుకే అమెరికా భరించలేకపోయింది. రోజుకు రూ. 2500 కోట్లుఖర్చుచేసేది. అది ఆ దేశ ఆర్థికవ్యవస్థకే భారమైంది. ఉత్తర కొరియా దూకుడును అడ్డుకోవడానికి 1950 నుంచి 1953 వరకు యుద్ధంచేసింది. వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. భీకర పోరాటంలో చివరకు ఎవరూ గెలవకుండా నే ‘కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ఆగిపోయిం ది. నేటికీ అక్కడ శాంతి ఒప్పందం జరగలేదు.

 war

మనుగడను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం

సోమాలియాలో జరుగుతున్న అంతర్యుద్ధం, కరువును అరికట్టడానికి అమెరికా 1992 నుంచి 1994 మధ్య శాంతి పరిరక్షక దళా లను పంపింది. అయితే, 1993లో అమెరికా సైన్యానికి, సోమాలియా తిరుగుబాటుదారుల మధ్య భీకర యుద్ధం జరిగింది. రాత్రంతా జరిగిన ఈ యుద్ధంతో తిరుగబాటు దారులతోపాటు సోమాలియా ప్రజలు కూడా అమెరికా సైన్యాన్ని, వారిని కాపాడటానికి వెళ్లిన దళాలను కూడా చుట్టుముట్టారు. దీంతో రాజకీయంగా ఒత్తిడిపెరిగి, లక్ష్యం పూర్తి కాకముందే 1994లో క్లింటన్ ప్రభుత్వం సైన్యాన్ని వెనక్కి పిలిపించింది. 1982,1984 మధ్య లెబనాన్లో శాంతిని నెలకొల్పడానికి పంపిన అమెరికా మెరైన్స్ పై 1983లో భారీ ఆత్మాహుతి దాడిజరిగింది. ఇందులో 241 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈభారీ ప్రాణనష్టాన్ని భరించలేక, అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కొద్ది నెలల్లోనే సైన్యాన్ని వెనక్కిరప్పించారు. ఇది అమెరికాకు పెద్ద సైనిక పరాజయం గా నిలిచింది. 1961లో క్యూబాలోని ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వా న్ని పడగొట్టడానికి అమెరికాచేసిన ప్రయత్నం విఫలమైంది. అమెరికా శిక్షణఇచ్చిన క్యూబా ప్రవాసుల సైన్యం మూడురోజుల్లోనే లొంగిపోయింది. అమెరికా మద్దతు ఉన్నప్పటికీ ఈఆపరేషన్ ఘోరంగా విఫలమవ్వడం వల్ల అంతర్జాతీయంగా అమెరికా పరువుపోయింది. ఒకప్పు డు మేము చెప్పిందే వేదం, మేము వచ్చి గొడవలు ఆపుతాం అన్న అమెరికా, ఇప్పుడు మీ యుద్ధాలు మీరే చూసుకోండి, మేము కేవలం ఆయుధాలు, సలహాలు మాత్రమేఇస్తాం అనే ధోరణికి వచ్చేసింది. ఇది ఒక రకంగా అగ్రరాజ్యంగా తన మనుగడను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం.

-జి.సత్యనారాయణరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రష్యా శాంతి ప్రణాళిక: ఇరాన్ అణు సంక్షోభానికి చెక్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha