Dailyhunt
యుద్ధముప్పు నుంచి ఇక తప్పుకొందాం

యుద్ధముప్పు నుంచి ఇక తప్పుకొందాం

వార్త 2 weeks ago

Threat of war : ఏశాఖలోనైనా, ఏ ఉద్యోగంలో నైనా అనుభవంతో రిటైర్ అయిన అధికారి ఆసక్తికరమైన విషయాలు ముచ్చటించినా పెద్దగా పట్టించుకోని మనస్తత్వం చాలా మందికి ఉంటుం ది.

కానీ కొందరు అలాంటి ముచ్చట్ల ను ప్రోత్సహిస్తారు. ఈ మధ్య ఒక అధికారే ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణ లూ అమెరికా జోక్యం నేపథ్యంలో కొన్ని అంశాలు స్నేహితులతో ప్రస్తావించడం జరిగింది. లోతైన ఆ వివరణ వినేవారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయ టమే కాకుండా, ఆ సమస్య పట్ల అవగాహన పెంచింది. మొదటి ప్రపంచ యుద్ధం ఆస్ట్రేలియా- హంగేరీ ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ను చంపేయడంతో మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీ, పోలెండ్ను ఆక్రమించటంతో మొద లైంది. ఇద్దరి మధ్య మొదలైన యుద్ధంలో ఇతర దేశాలు పాల్గొనటం జరిగింది. నిజానికి ఆ ఇద్దరి మధ్య ఉన్న కార ణాలు వారి స్వప్రయోజనాలకు సంబంధించినవే. మొదటి ప్రపంచ యుద్ధంలో మిగిలి ఉన్న సమస్యలు, రెండవ ప్రపంచ యుద్ధం జరగటానికి కారణమవుతే, ఎన్నో సమస్య లు అపరిష్కృతంగా ప్రపంచ యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా ఉండటం చేత ‘కోల్డ్ వార్’ అని పిలవబడే ప్రచ్చన్న యుద్ధం అంతే కొనసాగటం గమనార్హం.

Read Also : Chief Majid Khademi: యుద్ధంలో ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం!

 threat of war

threat of war : యుద్ధాల పరిణామాలు

సోవియెట్ యూనియన్ ఆఫ్ రష్యా నిలువునా చీలిన తర్వాత కూడా సమస్య లు సమస్యలుగానే మిగిలి ఉన్నాయి. ఈ రెండు ప్రపంచ యుద్ధాలు ఇష్టంలేని రాజ్యాలను కూడా పాల్గొనేటట్లు చేశా యి. వారు ఇష్టం లేని పరిస్థితులలో కూడా యుద్ధాలవైపు వారి శత్రుత్వాలే కారణం కావటంతో గత్యంతరం లేక తల దూర్చాల్సి వచ్చింది. ఈ రెండు ప్రపంచ యుద్ధాల ప్రభా వం జోక్యం చేసుకోని దేశాల మీద కూడా తీవ్రంగా పడింది. ప్రపంచ వాణిజ్య, వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతులు అస్తవ్యస్త పరిస్థితులకు లోనయ్యాయి. దాదాపు అశనిపాతం లా దాపురించిన యుద్ధాల పరిణామాలు చాలా వరకు ప్రపంచ దేశాలను వెన్నాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల రోజుల సంరక్షణల ప్రభావం అదే విధంగా ఉండొచ్చు. మనుషులకు భగవంతుడు ఆలోచనాశక్తిని ఇచ్చాడు కానీ దురాలోచనలు చేయడానికి ప్రతిబంధకాలు మనుషుల మేధస్సుకు పెట్టకపోవడం వల్ల కొన్ని తెచ్చిపెట్టుకుంటున్న ఆపదలతో సతమతమవుతూ, నాయకులు అహానికి బలవు తూ, సామాన్యులు కడగండ్లపాలు అవుతున్నారు. డాలర్ విలువనూ, దాని ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోటానికి అమెరికా దేశం వేసిన ఎత్తుగడ ముస్లిం దేశాలను అంటే గల్ఫ్ దేశాలను తన రక్షణ నీడలో ఉండే ప్రణాళికతో మిలటరీ బేస్లను గల్ఫ్ దేశాలలో ఏర్పాటు చేసి, నిరంత రం తన మీద ఆధారపడే రీతిలో చాలా వరకు విజయం సాధించింది. అటు ఇజ్రాయిల్, యూదుల కోసం ఇటు ఇరాన్ లాంటి దేశాలు పాలస్తీనా కోసం ఘర్షణలు పడక తప్పని పరిస్థితిలో అమెరికా డాలర్కు చమురు గనులు ఉత్పత్తులలో లాభాలు పొందుతూ బలపడేటట్లు చేసింది.

మూడవ ప్రపంచయుద్ధం ఖాయం

ప్రస్తుతం గల్ఫ్ దేశాలు, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో దెబ్బల అబ్బాయిగా అమెరికా దౌత్య విధానంతో శిక్షను అనుభవించక తప్పటంలేదు. సొమ్ము ఒకరిదైతే సోకు మరొకరిది. శిక్ష వేరొకరిది అన్న రీతిలో ప్రపంచ దేశాల పరిస్థితులు మారాయి. ఈ పరిణామాలు మొదలవటానికి ముఖ్యకారణం లోతుగా పరిశీలిస్తే అవగతమవుతుంది. షియా తెగకు చెందిన ఇరాన్ దేశం శాశ్వత శత్రువుగా యూదులకు మారటంతో ఇజ్రాయెల్ దేశం మనుగడ కష్ట మయింది. ప్రపంచ దేశాలు ఇరుపక్షాల మధ్య సంధికుదిర్చి ఇరాన్, ఇజ్రాయిల్క అధికారిక గుర్తింపు ఇచ్చేటట్లు చేసిన ట్లయితే మిడిల్ ఈస్ట్లోశాంతి నెలకొల్పబడేది. కానీ అది జరగలేదు. ఇప్పుడు న్యూట్రల్ దేశాలు అమెరికా, ఇరాన్ యుద్ధంలో తలదూరుస్తే మూడవ ప్రపంచయుద్ధం ఖాయం గా సంభవిస్తుంది. చరిత్ర మరోసారి పునరావృతం అవుతుం ది. రష్యా, చైనాలు బహిరంగంగా యుద్ధ భూమిలోకి ప్రవే శించకపోతే మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఇరానన్ను బలపర్చే ఎమెన్, హౌతీలను అదుపులో ఉంచగలుగుతే యుద్ధపరిణామాలు మరో విధంగా ఉంటాయి. హార్మూజ్జ లసంధి ఇరాన్చేజారితే యుద్ధం ఆగు తుందని అమెరికా భావిస్తున్నది. అమెరికా ఎత్తుగడ పారుచే చమురు గనుల మీద పట్టుసాధించి మళ్లీ డాలర్ను గ్లోబల్మారక ద్రవ్యంగా మార్చవచ్చని ట్రంప్ ఆలోచన. ఎప్పుడూ బిజినెస్ ఏంగిల్ను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించే అధ్యక్షుడ్ని అమెరికన్ ప్రజలు ఎన్నుకోవటం లాభమో, నష్ట మో కాలంగడిస్తేనే గాని బయటపడదు. హార్మూజ్ అమెరికా గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తుందని నిపుణుల అంచనా. అంచనాలు నిజాలు కావల్సిన అవసరం లేదని కాలగమనం తెల్పుతూనే ఉంటుంది.

 threat of war

ఆర్థికతిరోగమనానికి కారణం

ఏదో చిన్నచిన్న సం ఘర్షణలతో చాలావరకు యుద్ధరహిత వాతావరణంలో కాలం వెళ్లబుచ్చుతున్న ప్రపంచ దేశాలు ఈప్రస్తుత పరిణామాలతో బిక్కుబిక్కున దినమొకగండంగా ప్రమాదాల అంచున ఉన్నా యి. కాశ్మీరు సమస్యకు పాకిస్థాన్ చైనా లాంటి దేశాలు అప్పుడప్పుడూ నిప్పురాజేస్తూ భారత్కుగడ్డుకాలాన్ని సృష్టిం చాలని విఫల ప్రయత్నాలు చేశాయి. సంయమనంతో, సమ స్యను సమస్యగానే కుదించి, ఇతరదేశాల జోక్యాలను అదుపు లో ఉంచుతూ ప్రపంచ దేశాలకు ముఖ్యంగా పెద్ద దేశాలకు భారత్ ఏ సమస్యనైనా సమర్థవంతంగా పరిష్కరించుకోగల దన్న నమ్మకాన్ని కల్గించింది. ప్రత్యేకంగా దేశంలో అధికారం లో ఉన్నరాజకీయ నాయకుల సమన్వయం అధికార యంత్రాంగం సమయానుకూల నైపుణ్యం సామరస్య పూర్వక ధోరణి వల్ల భారత్ ఆర్థిక పురోభివృద్ధితోపాటు ప్రజాస్వామ్య దేశంగా పరిణితిని సాధిస్తున్నదన్న విశ్వాసాన్ని ప్రపంచ వ్యాప్తంగా కలిగించింది. అయితే అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ అనవసర యుద్ధం భారత్ లాంటి దేశాలకు ఎలాంటి ముప్పు చేస్తుందో ఆర్థికతిరోగమనానికి కారణం అవుతుందో అస్తవ్యస్త పరిస్థితులకు దారితీస్తుందో ఊహకు అందకుండా ఉంది. ఇప్పటికైనా దాదాపు నెల రోజుల్నుంచి జరుగుతున్న ఈ చిన్నసైజు యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధంగా మార కుండా ఉండేందుకు రష్యా, చైనా లాంటి దేశాలు గల్ఫ్ దేశాలు వెస్ట్ ఏషియాలోని అన్నిదేశాలు భారత్తోడ్పాడుతో యుద్ధ విరమణ ఒప్పందం కుదిరేలా చూడగలుగుతే అసలు సమ స్యలను చర్చలద్వారా పరిష్కరించుకోవచ్చు. ఇంగిత జ్ఞానం సామాన్యులకు కాని, అహంకారంతో విర్రవీగే దేశాలకు అన్నీ నష్ట పోయిన తర్వాత కలుగుతుందని పెద్దలు అంటారు. ఆలస్యం చేస్తే అమృతం విషంగా మారకతప్పదు.

-రావులపాటి సీతారాం రావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ట్రంప్ బూతు పురాణం.. ధీటుగా బదులిచ్చిన ఇరాన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha