Chief Majid Khademi: గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు ముగియడంతో, అగ్రరాజ్యం తన దాడులను తీవ్రతరం చేసింది.
ఈ క్రమంలో సోమవారం (ఏప్రిల్ 6, 2026) జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ కీలక అధికారి ఒకరు హతమవ్వడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
Read Also: Iran-USA War: ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ సంచలన వ్యాఖ్యలు!
Chief Majid Khademi: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు భారీ దెబ్బ
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్ (IRGC) ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ, సోమవారం తెల్లవారుజామున జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడుల్లో మరణించారు.ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘తస్నిమ్’ (Tasnim) వెల్లడించింది. ఆయన ‘వీరమరణం’ (Martyrdom) పొందారని ఐఆర్‌జీసీ ప్రకటించింది.గతంలో మొహమ్మద్ కజేమీ మరణం తర్వాత ఖదేమీ ఈ కీలక బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ భద్రతా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తిని కోల్పోవడం ఆ దేశానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
Chief Majid Khademi Killed
అయితే ఈ దాడుల విషయమై ఇజ్రాయెల్ వెంటనే స్పందించలేదు.''ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ అధిపతి.. విద్యావంతుడు, శక్తివంతుడైన మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ.. నేడు (సోమవారం) తెల్లవారుజామున అమెరికన్-జియోనిస్టు శత్రువుల నేరపూరిత ఉగ్రదాడిలో వీరమరణం పొందారు'' అని అని ఐఆర్‌జీసీ తమ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్టు చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

