Russia Ukraine War : సుదీర్ఘ కాలంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇరు దేశాల సైన్యాలను కోలుకోలేని దెబ్బ తీస్తోందని ప్రముఖ అమెరికన్ పరిశోధనా సంస్థ 'సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' (CSIS) తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఈ ఘోర కలియుద్ధంలో ఇరుపక్షాల వైపు కలిపి సైనిక నష్టం (మరణాలు, తీవ్ర గాయాలపాలైన వారు) ఏకంగా 20 లక్షల మార్కుకు చేరుకుందని స్పష్టం చేసింది. అయితే ఈ భారీ నష్టంలో రష్యా వైపే అత్యధికంగా క్యాజువాలిటీస్ నమోదవడం గమనార్హం. కేవలం రష్యా సైన్యంలోనే సుమారు 14 లక్షల మంది సైనికులు ప్రభావితం కాగా, వారిలో ఏకంగా 4,50,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఈ నివేదిక లెక్కగట్టింది. క్రెమ్లిన్ అనుసరిస్తున్న దూకుడు వ్యూహాలు ఆ దేశానికి ఎంతటి మానవ వనరుల నష్టాన్ని మిగిల్చాయో ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.

ఉక్రెయిన్ సైనికుల బలిదానాలు.. ముగింపు లేని సుదీర్ఘ పోరాటం
మరోవైపు, రష్యా వంటి అగ్రరాజ్యాన్ని ఎదిరించి వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్ సైన్యం కూడా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఉక్రెయిన్ వైపు ఇప్పటివరకు సుమారు 1,50,000 మంది సైనికులు రణరంగంలో వీరమరణం పొందగా, మరో 6,25,000 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని అమెరికా సంస్థ పేర్కొంది. గత 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన ఆకస్మిక సైనిక దాడులతో మొదలైన ఈ యుద్ధం, ఎన్నో అంతర్జాతీయ పరిణామాలు మారినప్పటికీ ఇప్పటికీ ముగింపు లేకుండా కొనసాగుతూనే ఉంది. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన మరియు సుదీర్ఘమైన సైనిక ఘర్షణల్లో ఒకటిగా నిలిచిన ఈ పోరు, ఇరు దేశాల భవిష్యత్తును మరియు సైనిక సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
అమెజాన్ ప్రైమ్‌కు షాక్: ఫెడరల్ కోర్టులో దావా వేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

