Nandu World : గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నే రమానందన దంపతులు ప్రస్తుతం యూకే (లండన్) లో స్థిరపడ్డారు. రమానందన 'నందూస్ వరల్డ్' పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ గుర్తింపును ఆసరాగా చేసుకుని, వీరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలలో 'డెస్టినీ కన్సల్టెన్సీ' పేరిట కార్యాలయాలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామంటూ ఈ కన్సల్టెన్సీ ద్వారా కార్యకలాపాలు సాగించారు.
Read Also: Another Trinamool Mayor Quits : తృణమూల్ మేయర్ రాజీనామా..మమతాకు గట్టి షాక్
Nandu World
Nandu World : రమానందన తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందన
ఈ తీవ్రమైన ఆరోపణలపై యూట్యూబర్ రమానందన తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తమ కుటుంబంపై వ్యక్తిగత కక్షతోనే కొందరు ఇదంతా పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె కొట్టిపారేశారు. తమ పేరు మీద గానీ, తమ భర్త పేరు మీద గానీ ఎలాంటి కంపెనీలు లేవని.. తమ పేర్లు వాడుకుని కొందరు అక్కడ సొమ్ము చేసుకుంటున్నారని, ఇటువంటి మోసపూరిత వ్యక్తులతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

