Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపునకు కేంద్రం కసరత్తు

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపునకు కేంద్రం కసరత్తు

వార్త 2 days ago

UPI Transactions: భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ రంగంలో సంచలనం సృష్టించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రతిపాదనను తెచ్చింది.

రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా సర్వీస్ ఛార్జీలు విధించే దిశగా పార్లమెంటులో ఒక సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

లోక్‌సభలో పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ సవరణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007’కు సవరణను ప్రతిపాదించారు. దీని ద్వారా రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే యూపీఐ చెల్లింపులపై రుసుములు వసూలు చేయడానికి చట్టపరమైన మార్గం సుగమమం కానుంది.

UPI Transactions: సామాన్యులపై ఎలాంటి భారం ఉండదు

ఈ కొత్త ప్రతిపాదన చూసి సామాన్య వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తుల మధ్య జరిగే పీ2పీ (Peer-to-Peer) బదిలీలు మరియు చిన్న వ్యాపారులకు చేసే రోజువారీ పేమెంట్స్‌పై ఎలాంటి రుసుములు వర్తించవు. కేవలం ఏడాదికి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అందుకునే రూ.2,000 పైచిలుకు చెల్లింపులపై మాత్రమే 0.3% నుంచి 0.5% వరకు ఎండీఆర్ వర్తించే అవకాశం ఉంది. ఈ భారాన్ని కేవలం వ్యాపారులు మాత్రమే భరిస్తారు తప్ప, వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదు.

ఎండీఆర్ పునరుద్ధరణ వెనుక అసలు కారణం

గతంలో 2020 జనవరి నుంచి యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ‘జీరో ఎండీఆర్’ విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల బ్యాంకులు, అలాగే ఫోన్‌పే, గూగుల్‌పే వంటి థర్డ్-పార్టీ యాప్‌ల నిర్వహణ సంస్థలకు యూపీఐ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. సర్వర్ల నిర్వహణ, అత్యాధునిక సాంకేతికత అభివృద్ధి, సైబర్ భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాలకు అయ్యే ఖర్చులను భరించడం ఆయా సంస్థలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తోంది.

ప్రభుత్వ అంచనాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ

ప్రస్తుతం దేశంలో రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలు సంఖ్యాపరంగా కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, వాటి ఆర్థిక విలువ మాత్రం దాదాపు 65 శాతం వరకు ఉంది. ఈ పెద్ద లావాదేవీలపై నామమాత్రపు రుసుము విధిస్తే, వార్షికంగా సుమారు రూ.5,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ప్రస్తుతం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు మాత్రమేనని, దీనికి సంబంధించిన తుది విధివిధానాలు, అమలు తేదీపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మక్క రైతులకు గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha