Maize Corn Price: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మక్కజొన్న (మక్కల) ధరలు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. గతంలో క్వింటా ధర రూ.2,400 ఉండగా, ప్రస్తుతం క్రమంగా పెరుగుతూ రూ.2,630 ల గరిష్ఠ స్థాయికి చేరింది.
ఓపెన్ మార్కెట్‌లో వ్యాపారులు ఆసక్తి చూపడంతో ధర బాగా పలికి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also :Water Levels in Reservoirs : జలకళ సంతరించుకుంటున్న తెలంగాణ జలాశయాలు
వరంగల్ మార్కెట్‌లో రికార్డు విక్రయం
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు ఉప్పుల రాజు తన వద్ద ఉన్న 226 బస్తాల మక్కజొన్నను సోమవారం వరంగల్ మార్కెట్‌కు తీసుకువచ్చారు. సీతారామ అడ్తి ద్వారా వెంకటరమణ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులు ఈ ధాన్యాన్ని క్వింటాకు రూ.2,630ల గరిష్ఠ ధరకు కొనుగోలు చేశారు.
Maize Corn Price: గతంలో ఎదురైన కష్టాలు

మూడు నెలల క్రితం మద్దతు ధర రూ.2,400 ఉన్నప్పటికీ ప్రభుత్వ మార్క్‌ఫెడ్ (Markfed) కొనుగోలు కేంద్రాల్లో సరైన నిర్వహణ లేక రైతులు 15 నుంచి 20 రోజుల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో చేసేది లేక అప్పట్లో ప్రైవేటు వ్యాపారులకు రూ.1,700 నుంచి రూ.1,900 లకే తక్కువ ధరకు మక్కలను అమ్ముకుని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే, ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ యార్డ్‌లోనే మద్దతు ధర కంటే ఎక్కువగా క్వింటాకు రూ.2,630 దక్కడంతో నిరాశలో ఉన్న రైతాంగానికి పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

