Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీఐ యూజర్లకు అలర్ట్.. ఇకపై డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీలు?

యూపీఐ యూజర్లకు అలర్ట్.. ఇకపై డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీలు?

వార్త 3 weeks ago

UPI Transaction Charges: దేశంలో నగదు రహిత లావాదేవీలను విప్లవాత్మకంగా మార్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలపై త్వరలో కొత్త నిబంధనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత ఐదేళ్లుగా ఉచితంగా అందుబాటులో ఉన్న యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన కీలక ముసాయిదా ప్రతిపాదన (Draft Proposal) కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. దీనికి ఆమోదం లభిస్తే పెద్ద వ్యాపార సంస్థల లావాదేవీలపై త్వరలోనే కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయి.

Read Also:OnePlus: వన్ ప్లస్ ఇండియాలో క్లోజ్ అవుతుందా? క్లారిటీ ఇచ్చేసిన కంపెనీ!

సామాన్యుడికి నో ఛార్జ్.. కేవలం పెద్ద మర్చంట్లకే

ఈ కొత్త ప్రతిపాదనల వల్ల సాధారణ వినియోగదారులకు (Customers) ఎలాంటి అదనపు భారం పడదు. కస్టమర్-టు-కస్టమర్ (C2C) లేదా చిన్న వ్యాపారులకు చేసే చెల్లింపులు ఎప్పటికప్పుడు ఉచితంగానే సాగుతాయి. కేవలం కార్పొరేట్ వ్యాపారాలు, ఈ-కామర్స్ దిగ్గజాలను మాత్రమే ఈ ఛార్జీల పరిధిలోకి తీసుకురానున్నారు. వార్షిక టర్నోవర్ (Annual Turnover) రూ.40 లక్షల కంటే తక్కువ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ నిబంధనల నుండి పూర్తి మినహాయింపు ఉంటుంది. రూ.40 లక్షలకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన పెద్ద మర్చంట్లపై 5 నుండి 7 బేసిస్ పాయింట్ల వరకు ఛార్జీలు విధించే యోచనలో ఉన్నారు. అంటే సుమారు రూ.10,000 పైబడిన ఒక్కో లావాదేవీకి రూ.5 నుండి రూ.7 వరకు మర్చంట్ ఫీజు వర్తించే అవకాశం ఉంది.

UPI Transaction Charges: యాప్స్, బ్యాంకుల ఆర్థిక స్థిరత్వం కోసమేనా?

జనవరి 2020 నుండి కేంద్ర ప్రభుత్వం యూపీఐపై జీరో-ఎండీఆర్ (Zero-MDR) విధానాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe), పేటీఎం (Paytm) వంటి డిజిటల్ వాలెట్ ఆపరేటర్లతో పాటు బ్యాంకులకు ఈ సేవల ద్వారా ఎలాంటి ప్రత్యక్ష ఆదాయం లభించడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న వార్షిక సబ్సిడీ నిధులు కూడా గ్లోబల్ మౌలిక వసతుల నిర్వహణకు, భద్రతా వ్యవస్థల అప్‌గ్రేడేషన్‌కు సరిపోవడం లేదని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, యూపీఐ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి మరియు డిజిటల్ పేమెంట్ యాప్స్‌కు స్థిరమైన ఆదాయ వనరును కల్పించడానికి ప్రభుత్వం పెద్ద వ్యాపారుల నుండి రుసుములు వసూలు చేసేందుకు మొగ్గు చూపుతోంది.

Epaper: epaper.vaartha.com

ఎస్‌పీహెచ్ తో ఆశ్రయు మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha