Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల

యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల

వార్త 2 weeks ago

UPSC Prelims 2026 Results: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష - 2026 ఫలితాలు సోమవారం (జూన్ 15) రాత్రి వెలువడ్డాయి.

ఈ పరీక్షలో ప్రతిభ చాటి, తదుపరి దశ అయిన ‘మెయిన్స్’ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 13,343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సివిల్స్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితాను కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in) లో పొందుపరిచింది.

మే 24న జరిగిన పరీక్ష.. పోస్టుల వివరాలు:

ఈ ఏడాది మొత్తం 1,016 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మే 24న దేశవ్యాప్తంగా ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. కాగా, గతేడాది (2025లో) 1,087 ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టగా.. అప్పట్లో 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు.

read also: Drogo Aerospace: భారత సైన్యానికి 41 అత్యాధునిక 'జేకే 250ఈ' డ్రోన్లను అందించిన హైదరాబాద్ సంస్థ

UPSC Prelims 2026 Results:జూన్ 19 నుంచి DAF-I దరఖాస్తులు:

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశకు వెళ్లడానికి విధిగా డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF-I) సమర్పించాల్సి ఉంటుంది.

  • దరఖాస్తు తేదీలు: జూన్ 19 నుంచి జూన్ 28, 2026 వరకు యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఈ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
  • పరీక్ష ఫీజు: DAF-I నింపే సమయంలో అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • మినహాయింపు: మహిళలు, ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు దివ్యాంగ (PwBD) అభ్యర్థులకు ఈ ఫీజు నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.

అభ్యర్థులకు వచ్చిన వ్యక్తిగత మార్కులు, కేటగిరీల వారీగా కటాఫ్ వివరాలు మరియు ఆన్సర్ కీ (Answer Key)లను ఇప్పుడు ప్రకటించలేదు. సివిల్ సర్వీసెస్ 2026 తుది ఫలితాలు (Final Results) పూర్తిగా వెలువడిన తర్వాతే వీటిని యూపీఎస్సీ విడుదల చేస్తుంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే కమిషన్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.

Epaper: epaper.vaartha.com

అభిజీత్ దిప్కేపై దాడి.. అసలు ఏం జరిగిందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha