Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూరియా యాప్ కు కేంద్రం ప్రశంసలు - తుమ్మల

యూరియా యాప్ కు కేంద్రం ప్రశంసలు - తుమ్మల

వార్త 1 week ago

Urea App : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'యూరియా యాప్' (Urea App) పై ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గత ప్రభుత్వాల హయాంలో సాగుతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున యూరియా కొనుగోలు చేసి, దానిని బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకునేవారని ఆయన గుర్తుచేశారు. ఈ తరహా అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తూ, కేవలం అర్హులైన నిజమైన రైతులకు మాత్రమే సకాలంలో ఎరువులు అందేలా ప్రస్తుత ప్రభుత్వం ఈ సరికొత్త డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని స్పష్టం చేశారు. ఈ సాంకేతిక సంస్కరణ వల్ల క్షేత్రస్థాయిలో యూరియా కొరత తీరి, పంపిణీ వ్యవస్థలో పారదర్శకత గణనీయంగా పెరిగిందని మంత్రి వివరించారు.

 Tummala Nageswara Rao

నాడు అక్రమాలు.. నేడు పారదర్శకత.. దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం సన్నాహాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యూరియా మొబైల్ యాప్ పనితీరును కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా అభినందించిందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా వెల్లడించారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతను అరికట్టడంలో ఈ యాప్ అద్భుతంగా పనిచేస్తోందని కేంద్రం గుర్తించిందని, అందుకే దీనిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను జోడించడం ద్వారా రైతులకు నేరుగా లబ్ధి చేకూరుస్తుంటే, తట్టుకోలేకనే ప్రతిపక్షాలు అన్నదాతలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి అని, ఇలాంటి కుట్రలను తిప్పికొడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.

ఓటర్ నమోదుపై హరీష్ రావు కీలక ప్రకటన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha