Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటర్ నమోదుపై హరీష్ రావు కీలక ప్రకటన!

ఓటర్ నమోదుపై హరీష్ రావు కీలక ప్రకటన!

వార్త 1 week ago
  • స్పెషల్ ఇంటిన్సివ్ రివిజన్ (SIR ) కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి…
  • ప్రజలకు ఎన్యూమరేషన్ ఫామ్ నింపే ప్రక్రియ లో ప్రజలకు సహకరించాలి…
  • SIR కార్యక్రమం లో ప్రజలు పాల్గొనేల పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలి..
  • బూత్ లెవల్ ఏజెంట్స్ ప్రతి ఓటరుని కాలవాలి.. ప్రతి గడపను తట్టాలి…
  • బూత్ లెవల్ ఎజెంట్స్ బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలి…
  • కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కెసిఆర్ అభిమానులు భాగస్వామ్యం చేయాలి..
  • నెటి నుండి ప్రారంభం అయ్యే SIR కార్యక్రమం పై పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు.

Siddipet news:సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలిచామని అదే స్థాయి లో SIR కార్యక్రమం లో ముందు ఉండాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు.. ఈ సందర్బంగా మాట్లాడుతు స్పెషల్ ఇంటిన్సివ్ రివిజన్ SIR కార్యక్రమం రాష్ట్రం లో ఇప్పటి వరకు ఫ్యామిలీ మ్యాపింగ్ పూర్తి అయిందని, నెటి నుండి డూర్ టూ డూర్ వెల్లి ఓటు నమోదు చేసే కార్యక్రమం జరుగుతుందని.. సిద్దిపేట నియోజకవర్గం లో ఇప్పటి వరకు 70% అయిందని, టౌన్ లో 69 % అయిందని, రూరల్ మండలాల లో 90% పూర్తి అయిందని చెప్పారు.. ఈ కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ముఖ్యం గా బూత్ లెవల్ ఏజెంట్స్ క్రియాశీలంగా పని చేయాలని చెప్పారు. స్పెషల్ ఇంటిన్సివ్ రివిజన్ (SIR ) కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.. SIR కార్యక్రమం లో ప్రజలు పాల్గొనేల పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని .ప్రజలకు ఎన్యూమరేషన్ ఫామ్ నింపే ప్రక్రియ లో ప్రజలకు అందుబాటులో ఉండి సహకరించాలని చెప్పారు..

Read also: TG LAWCET 2026: తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల!

Siddipet news: యువత ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి

బూత్ లెవల్ ఏజెంట్స్ ప్రతి ఓటరుని కాలవాలి.. ప్రతి గడపను తట్టాలని చెప్పారు ..బూత్ లెవల్ ఎజెంట్స్ బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కెసిఆర్ అభిమానులు భాగస్వామ్యం చేయాలని చెప్పారు.. ఈ ప్రక్రియ రెండు నెలల పాటు ఉంటుందని 18సంవత్సరాలు నిండిన వారు ఓటు ఎన్రోల్మెంట్ చేసుకొనే విధంగా అవగాహన కలిపించాలని అక్టోబర్ 1 తేదీ వరకు ఫైనల్ ఓటర్ జాబితా వస్తుందని అప్పటిలోగా డబుల్ ఓట్లు లేకుండా, మార్పులు చేర్పులు చేసే విధంగా ఎప్పటికప్పుడు చూడలన్నారు.. ఈ కార్యక్రమం పై క్యాంప్ కార్యాలయం లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కలెక్టర్ కార్యాలయం లో Sir పై సందేహాల నివృత్తి చేసేందుకు లిఖిత అనే ప్రభుత్వ అధికారిని నియమించారని చెప్పారు.. బూత్ లెవల్ ఏజెంట్స్ క్రియాశీలంగా పాల్గొని అంగన్ వాడి, ఆర్ పి లతో సమన్వయం చేసుకోవాలన్నారు..

Epaper: epaper.vaartha.com

తెలంగాణకు గుడ్‌న్యూస్: రహదారుల ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha