Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ

వార్త 1 week ago

Jyoti Malhotra: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి చుక్కెదురైంది. పాకిస్థాన్ నిఘా సంస్థల ప్రతినిధులకు భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారనే కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దీంతో ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే మరికొన్నాళ్లు గడపాల్సి రానుంది.

 JyotiMalhotra

Read also: Kerala Weather Update: కేరళలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు

జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి, జ్యోతి మల్హోత్రాకు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతకుముందు ఈ ఏడాది మార్చిలోనే పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నిందితురాలు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అప్పట్లోనే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూనే జ్యోతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Jyoti Malhotra: యూట్యూబ్ ఛానెల్ పేరుతో గూఢచర్యం?

హర్యానా పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో జ్యోతిపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ (1923)తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠిన సెక్షన్లను నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఆమె ‘ట్రావెల్ విత్ జో’ (Travel with Jo) అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తోంది. తన పాకిస్థాన్ పర్యటనల సమయంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారి ఎహసాన్-ఉర్-రహీంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో సోషల్ మీడియా ద్వారా పలువురు పాక్ నిఘా ఏజెంట్లతో కనెక్ట్ అయ్యింది. భారతదేశంలోని కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాలైన పాండో డ్యామ్, మున్నాబావో రైల్వే స్టేషన్, సీఆర్‌పీఎఫ్ (CRPF) క్యాంపులకు సంబంధించిన రక్షణ సమాచారాన్ని, వీడియోలను, ఫోటోలను వారికి చేరవేసింది. అంటూ పోలీసులు ఆరోపించారు.

చాట్ రికార్డుల డిలీట్.. సిట్ పక్కా ఆధారాలు!

తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని, దర్యాప్తు ముగిసి ఛార్జ్‌షీట్ కూడా దాఖలైనందున తనకు బెయిల్ ఇవ్వాలని జ్యోతి కోర్టులో వాదించింది. అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ వాదనలను గట్టిగా తిప్పికొట్టింది. జ్యోతి పాక్ ఏజెంట్లతో నిరంతరం రహస్యంగా మాట్లాడిందని, పట్టుబడకుండా ఉండేందుకు చాట్ హిస్టరీని కూడా డిలీట్ చేసిందని సిట్ ఆధారాలను కోర్టు ముందుంచింది. 2025 మే 16న హిసార్‌లో నమోదైన ఈ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి జ్యోతి కస్టడీలోనే ఉంది. గతేడాది ఆగస్టులోనే సిట్ ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు 2,500 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also Epaper : epaper.vaartha.com

Read also:

విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha