Youtuber Ravan Case: హిందూ దేవతలను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ వెనుక ఉన్న అసలు అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఈనెల 1న పిఠాపురం పోలీసుల చేతిలో అరెస్టయిన రావణ్ ఫోన్ డేటాను కాకినాడ పోలీసులు విశ్లేషించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసిన ఉదంతాలు, మరోవైపు దేశద్రోహం కేసులతో రావణ్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది.
Read Also:Vizag Fishermen Missing : ఉమ్మడి దళాల సుదీర్ఘ గాలింపు చర్యలు
ఫోరెన్సిక్ రిపోర్టుతో దొరికిపోయిన రావణ్

పోలీసులు రావణ్‌ను అరెస్టు చేయడానికి ముందే అతను తన మొబైల్ ఫోన్‌లోని డేటాను పూర్తిగా డిలీట్ చేశాడు. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ను రికవరీ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. తాజాగా వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు షాకింగ్ విషయాలను గుర్తించారు. అమాయక యువతులను టార్గెట్ చేసి, వారితో ఏకాంతంగా ఉన్న సమయంలో రావణ్ ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆధారాలు లభించాయి. ఆ దృశ్యాలను చూపించి అతను సదరు యువతులను తీవ్రంగా బ్లాక్‌మెయిల్‌కు గురిచేసినట్లు ఫోరెన్సిక్ డేటా ద్వారా స్పష్టమైంది. ఈ దందాలో ఇప్పటికే 10 మందికి పైగా బాధిత యువతులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Youtuber Ravan Case: గన్నవరంలో దేశద్రోహం, ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద కేసు
మరోవైపు రావణ్‌పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, దేశంలో సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడనే ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యతకు భంగం కలిగించినందుకు గానూ భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152తో పాటు, కఠినమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA – Unlawful Activities Prevention Act) కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టు రావణ్‌కు ఈనెల 18 వరకు రిమాండ్ విధించడంతో అతను జైలులో ఉన్నాడు. ఇటు క్రైమ్ బ్రాంచ్, అటు ప్రత్యేక పోలీసు బృందాలు అతనిపై నమోదైన రెండు విభిన్న కేసులపై విచారణను మరింత వేగవంతం చేశాయి.
Epaper: epaper.vaartha.com

