Dhurandhar movie : యాక్షన్ డ్రామా 'ధురంధర్' (Dhurandhar) ఓటీటీ వీక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యే డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు సరికొత్తగా ఎలాంటి కట్‌లు లేని 'రా అన్‌కట్ వెర్షన్' (Raw Uncut Version) తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మే 22 నుండి ఒకేసారి రెండు దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వెర్షన్ అందుబాటులోకి రానుండటంతో అభిమానుల్లో జోష్ పెరిగింది.
రెండు ఓటీటీల్లో ఒకేసారి.. అన్‌కట్ రచ్చ!
నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన అధికారిక వివరాల ప్రకారం.. 'ధురంధర్' మొదటి భాగానికి సంబంధించిన ఒరిజినల్ రా వెర్షన్ మే 22 నుండి నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar) లోనూ ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కట్ అయిన బోల్డ్ డైలాగులు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్సులు, ఇంటెన్స్ విజువల్స్ ఈ అన్‌కట్ వెర్షన్‌లో గూస్‌బంప్స్ తెప్పించనున్నాయి. ఈ స్పెషల్ వెర్షన్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ డిజిటల్ ప్రియులకు అందుబాటులోకి రానుంది.
Read Also : ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన 'కరుప్పు' టీమ్
Dhurandhar movie‘ధురంధర్ 2’ అప్‌డేట్ ఇదే!
మొదటి భాగం రా వెర్షన్ రిలీజ్ అవుతుండటంతో చాలామంది ‘ధురంధర్ 2’ గురించే అనుకున్నారు. అయితే, సీక్వెల్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘ధురంధర్ 2’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. ఈ రెండో భాగం జూన్ 4 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, పార్ట్ 1 లాగా కాకుండా.. పార్ట్ 2 మాత్రం థియేటర్లలో విడుదలైన సెన్సార్ వెర్షన్‌తోనే ఓటీటీలోకి రాబోతోందని స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

