Dailyhunt
మీ హోటల్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..?

మీ హోటల్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..?

వార్త 3 weeks ago

LPG fee in restaurants: మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు మెనూ కార్డులోని ధరలను చూసి ఆహారాన్ని ఆర్డర్ చేస్తాము. కానీ బిల్లు వచ్చేసరికి అందులో వంట గ్యాస్ ఖర్చులు లేదా ఫ్యూయెల్ సర్ఛార్జ్ పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు.

ఇలా మెనూ ధర కంటే ఎక్కువగా గ్యాస్ ఖర్చులను విడిగా వేయడం వినియోగదారులను మోసం చేయడమేనని ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆహార తయారీకి అయ్యే ఖర్చులను ముందే మెనూ ధరలో కలపాలని, విడిగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

Read also: Bangalore, Hyderabad: బెంగళూరు, హైదరాబాద్ మధ్య పోటీ..రెండింట్లో సిలికాన్ వ్యాలీ ఏది?

Is an LPG fee being charged on your hotel bill?

LPG fee in restaurants: కస్టమర్ల అనుమతి లేకుండా ఇలాంటి హిడెన్ ఛార్జీలను వేయకూడదు

వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం హోటల్ యాజమాన్యాలు కస్టమర్ల అనుమతి లేకుండా ఇలాంటి హిడెన్ ఛార్జీలను వేయకూడదు. మెనూలో ఉన్న ధరపై ప్రభుత్వం నిర్ణయించిన జిఎస్‌టి (GST) వంటి పన్నులు మాత్రమే అదనంగా ఉండాలి. వ్యాపారం నిర్వహించడానికి అయ్యే ఇంధన ఖర్చు అనేది యజమాని వ్యక్తిగత బాధ్యత మాత్రమేనని సిసిపిఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పారదర్శకత లేని ఇటువంటి పద్ధతులు అన్యాయమైన వాణిజ్య విధానాల కిందకు వస్తాయని హెచ్చరించింది.

అన్యాయమైన ఛార్జీలపై ఫిర్యాదు చేయడం ఎలా

మీ బిల్లులో ఇలాంటి అనవసరపు ఎల్‌పిజి ఫీజులు కనిపిస్తే వెంటనే రెస్టారెంట్ మేనేజర్‌ని ప్రశ్నించి వాటిని తొలగించమని కోరాలి. ఒకవేళ వారు స్పందించకపోతే మీరు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ నంబర్ 1915 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ఇ-జాగృతి పోర్టల్‌లో కూడా మీ ఫిర్యాదును నమోదు చేసే అవకాశం ఉంది. సామాన్య ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ఇలాంటి అదనపు వసూళ్లపై పోరాడటం ప్రతి వినియోగదారుడి బాధ్యత అని గుర్తుంచుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్..మనకు గుడ్‌న్యూస్ యేనా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha