Mahabubnagar news:మాదకద్రవ్యాలు ప్రమాదకర వ్యసనం. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జానకి, మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని మహబూబ్నగర్ ఎస్పీ జానకి ధరావత్ పేర్కొన్నారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలో స్టేడియం గ్రౌండ్ లో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డి.జానకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ ముందుగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం సిగ్నేచర్ క్యాంపెయినింగ్ బోర్డుపై సంతకం చేసి కార్యక్రమానికి తమ మద్దతును తెలియజేశారు. అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించగా, జిల్లా ఎస్పీ అధికారులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్‌తో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.
Read also: Ponnam Prabhakar: 'రేషన్' అభ్యర్థనలు తగ్గి.. పెన్షన్ విన్నపాలు పెరిగాయి
Drug eradication awareness rally
Mahabubnagar news:తల్లిదండ్రుల పర్యవేక్షణే రక్షణ కవచం
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల బారిన పడిన వ్యక్తి మాత్రమే కాకుండా, వారి కుటుంబం, సమాజం మొత్తం తీవ్ర ప్రభావానికి లోనవుతుందని అన్నారు. యువత తమ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, సమాజాన్ని వ్యసన రహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి.డబ్ల్యూ.ఓ జరీనా, డి.ఎల్.ఎస్.ఎ. టీం, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి, వర్నిక ఎన్.జీ.ఓ., జిల్లా అధికారులు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ అజాజుద్దీన్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

