Narendra Modi: ప్రఖ్యాత బెంగాలీ నవలా రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని, శరత్‌చంద్ర గొప్ప సాహిత్య ప్రతిభను అలాగే సమాజ సంస్కరణల కోసం ఆయన చేసిన నిరంతర కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రచనలు
శరత్‌చంద్ర కలం నుండి జాలువారిన సృష్టనలు కేవలం బెంగాలీ భాషకే పరిమితం కాలేదని ప్రధాని కొనియాడారు. దేశంలోని అనేక ప్రాంతీయ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు విదేశీ భాషల్లోకి కూడా ఆయన పుస్తకాలు అనువాదమయ్యాయని తెలిపారు. 19వ శతాబ్దపు నాటి గ్రామీణ బెంగాల్ సామాజిక జీవన శైలిని, అక్కడి వాస్తవ పరిస్థితులను ఆయన తన రచనల్లో ఎంతో సహజంగా కళ్లకు కట్టినట్లు చూపించారని ప్రశంసించారు. నేటికీ ఆయన నవలలు పాఠకాదరణ పొందడానికి ఇదే ముఖ్య కారణమని పేర్కొన్నారు.
Narendra Modi: సమాజ సంస్కరణలు మరియు యువతకు స్ఫూర్తి
కేవలం ఒక రచయితగానే కాకుండా, సమాజంలో రుగ్మతలను రూపుమాపే సంస్కర్తగా, మహిళా హక్కుల పరిరక్షకుడిగా, జాతీయవాద భావాలు గల వ్యక్తిగా శరత్‌చంద్ర చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమని మోదీ అభివర్ణించారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు భావితరాల యువతకు ఎంతో మార్గదర్శకమని తెలిపారు. నేటి యువత ఆయన సాహిత్యాన్ని మరింత ఎక్కువగా చదివి స్ఫూర్తి పొందాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

