Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ZEE సుభాష్ పై CBI కేసు

ZEE సుభాష్ పై CBI కేసు

వార్త 2 weeks ago

LIC Loan Fraud : జీ (ZEE) గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తీవ్రమైన క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు సుభాష్ చంద్రతో పాటు మరికొందరిపై సిబిఐ ప్రథమ సమాచార నివేదిక (FIR) దాఖలు చేసింది.

తప్పుడు మరియు నకిలీ పత్రాలను సృష్టించి తన నికర ఆస్తి (నెట్‌వర్త్) విలువను ఏకంగా రూ. 59,113 కోట్లుగా చూపించారనేది ప్రధాన ఆరోపణ. ఈ తప్పుడు పత్రాల ఆధారంగా తన వ్యక్తిగత గ్యారంటీని ఉపయోగించి వివిధ అనుబంధ కంపెనీలకు రూ. 1,322 కోట్ల మేర రుణాలను ఇప్పించి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్సీఎల్టీ తీర్పు వివాదం మరియు తదుపరి పరిణామాలు

ఈ రూ. 1,322 కోట్ల బారీ రుణాల రికవరీ మరియు సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇటీవల వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ తీర్పుపై పెను విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలోనే సీబీఐ రంగంలోకి దిగి క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలలో నకిలీ పత్రాలతో పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిన ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయి.

పెరిగిన బంగారం ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha