Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైకోర్టు జడ్జిపై అసత్య ప్రచారాల విచారణకు మరో సిట్

హైకోర్టు జడ్జిపై అసత్య ప్రచారాల విచారణకు మరో సిట్

VIDHATHA 6 days ago

హైకోర్టు మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాలపై సమగ్ర విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది.

తెలంగాణ హైకోర్టు జడ్జి, ఆమె భర్తపై సోషల్ మీడియా వేదికగా జరిగిన తప్పుడు ప్రచారం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)ను ఏర్పాటు చేసింది.

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించి హైకోర్టు జడ్జి, ఆమె భర్తపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేసిన నెల్లూరుకు చెందిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

బండి భగీరథ్‌కు బెయిల్ ఇస్తే జడ్జి భర్తకు చైర్మన్ పదవి ఇస్తారంటూ ప్రచారం చేశాడు. అయితే హైకోర్టు న్యాయమూర్తిపై ఇంకా ఎవరెవరు అసత్య ప్రచారాలు చేశారు?….వారి వెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలను కనిపెట్టేందుకు జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలో మరో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ప్రభుత్వం నియమించింది.

ఇకపోతే బండి భగరథ్ పై నమోదైన ఫోక్సో కేసు విచారణకు ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో హైకోర్డు మహిళా జడ్జిపై దుష్ప్రచారం చేసిన వ్యవహారంపై విచారణకు మరో సిట్ వేయడం గమనార్హం.

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA