Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్దపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షల ధాన్యం బుగ్గిపాలు

పెద్దపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షల ధాన్యం బుగ్గిపాలు

VIDHATHA 3 days ago

పెద్దపల్లి జిల్లా ఇందుర్తిలో వరి కొయ్యల మంటలు ధాన్యం కుప్పలకు అంటుకుని రూ.20 లక్షల విలువైన విత్తన ధాన్యం బుగ్గిపాలైంది.

వేసవిలో రైతులు పంట వ్యర్ధాలను తగులబెట్టే క్రమంలో, విద్యుద్ఘాతాలతో పెద్ద ఎత్తున తరుచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

అగ్నిప్రమాదాలో రైతుల పంటలు, సాగు పరికరాలు, పంట నిల్వలు నష్టపోతున్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు..గాలికి ఎగసిపడి చేతికొచ్చిన ధాన్యం కుప్పలకు అంటుకుంది.

ఈ ప్రమాదంలో నలుగురు రైతులకు చెందిన విత్తన ధాన్యం పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ. 20 లక్షల నష్టం వాటిల్లింది. రైతులు వెంటనే ట్రాక్టర్లతో నీటిని తెచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA