Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఐఏఎస్ లు ముగ్గురికి జాతీయ పురస్కారాలు

తెలంగాణ ఐఏఎస్ లు ముగ్గురికి జాతీయ పురస్కారాలు

VIDHATHA 6 days ago

తెలంగాణకు చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ సర్వే 2026 జాతీయ పురస్కారాలకు ఎంపికై రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చారు.

తెలంగాణకు చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు హరి చందన దాసరి, సి.

నారాయణ రెడ్డి, మిక్కిలినేని మను చౌదరిలు భారత్ లోని ప్రతిష్టాత్మకమైన "ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ సర్వే 2026" పురస్కారాలకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా దాదాపు 800 జిల్లాల కలెక్టర్ల నుంచి…. వినూత్న పాలన, ప్రజా సేవ, పరిపాలనా నైపుణ్యాలను విశ్లేషించి, టాప్ 100 జిల్లా కలెక్టర్ల జాబితాను ఎంపిక చేస్తారు. ఈ అరుదైన జాబితాలో వారు స్థానం దక్కించుకోవడం విశేషం.

ఫేమ్ ఇండియా మ్యాగజైన్, ఏషియా పోస్ట్‌తో కలిసి నిర్వహించిన "ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ సర్వే 2026" నాయకత్వం, ప్రజలతో సంబంధాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సామర్థ్యం, సమాజంపై ప్రభావం వంటి పలు అంశాలపై కలెక్టర్లను మూల్యాంకనం చేసింది. ఈ అంచనాలో ప్రజాభిప్రాయంతో పాటు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

తెలంగాణకు చెందిన ముగ్గురు ఐఏఎస్ లు "ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ సర్వే 2026" పురస్కారాలకు ఎంపికవ్వడం.. తెలంగాణ రాష్ట్రం సమర్ధవంతమైన పరిపాలన సామర్ధ్యాలకు, అంకితభావంతో కూడిన అధికారుల ప్రజా సేవకు నిదర్శనమని అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.

21న తెలంగాణ కేబినేట్ సమావేశం
తీరని మంత్రి సీతక్క చదువుల దాహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA