Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితి పెంపు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితి పెంపు

VIDHATHA 5 days ago

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం మరో ఏడాది సడలింపును పొడిగించింది.

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగులకుతెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. గతంలోనే వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆ సడలింపును మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది.

ఈ వయోపరిమితి సడలింపు ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసేందుకు అర్హత లభించే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA