Dailyhunt
తేయాకు తోటలో దానిని చూసి పరుగే పరుగు!

తేయాకు తోటలో దానిని చూసి పరుగే పరుగు!

VIDHATHA 3 weeks ago

ర్వత గిరులు, లోయల ప్రాంతాల్లో సాగు చేసే తేయాకు తోటల్లో ఆకుసేకరణ పనులు చేసే కూలీలకు జంతవులు, పాములతో ఒక్కోసారి అనూహ్య ప్రమాదాలు ఎదురవుతుంటాయి.

తాజాగా తమిళనాడులోని ఊటీ తోటలలో తేయాకు తోటలలో పనులకు వెళ్లిన కూలీలకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

విధాత : గుబురుగా..వరుసల క్రమంలో పెరిగే తేయాకు తోటల్లో పని చేయడం ఒక్కోసారి ఎంతో ప్రమాదకరం. ముఖ్యంగా పర్వత గిరులు, లోయల ప్రాంతాల్లో సాగు చేసే తేయాకు తోటల్లో ఆకుసేకరణ పనులు చేసే కూలీలకు జంతవులు, పాములతో ఒక్కోసారి అనూహ్య ప్రమాదాలు ఎదురవుతుంటాయి. తాజాగా తమిళనాడులోని ఊటీ తేయాకు తోటలలో పనులకు వెళ్లిన కూలీలకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఆకు సేకరణ పనులకు వెళ్లిన కూలీలకు తోటలలోని దట్టమైన తేయాకు పొదల మధ్య ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న ఒక చిరుతపులి కనిపించింది. మచ్చల శరీరంతో కూడిన చిరుత పచ్చని తేయాకు చెట్ల మధ్య కలిసిపోయి ఉండటంతో దగ్గరిదాకా వెళితేగాని కూలీలు దాని ఉనికిని గుర్తించలేకపోయారు. చిరుతను గమనించిన కూలీలు అప్రమత్తమై వెంటనే దూరంగా పరుగెత్తారు. అయితే అదృష్టవశాత్తు చిరుత కూలీలపై ఎలాంటి దాడికి పాల్పడుకుండా విశ్రాంతి తీసుకోవడం..ఆ తర్వాత కూలీల అలికిడి గమనించి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వారికి ఎలాంటి ప్రమాదం ఎదురుకాలేదు. తోటలు, పంట పొలాలలో పనిచేసే కూలీలు ముందు జాగ్రత్తగా గుంపులుగా వెళ్లాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

మేఘమలై, శ్రీవిల్లిపుత్తూరు, వైగై పరివాహక ప్రాంతం , ఊటీ అటవీ ప్రాంతాలు వన్యప్రాణులకు, జీవవైవిధ్యానికి ఆలవాలంగా మారాయి. నీలగిరి కొండలలోని తేయాకు తోటల ఆవాసాలకు చిరుతపులులు బాగా అలవాటుపడతూ..మనుషులపై దాడులు దిగకుండా జీవనం కొనసాగిస్తున్న తీరు అక్కడి జీవ వైవిధ్యాన్ని చాటుతుందంటున్నారు వన్యప్రాణి నిపుణులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA