Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రెండింగ్.. పీవీ సింధూ "టెంపుల్" క్లిప్ !

ట్రెండింగ్.. పీవీ సింధూ "టెంపుల్" క్లిప్ !

VIDHATHA 3 days ago

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్టార్ క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో సింధూ ధరించిన ఓ పరికరం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పీవీ సింధూ మాత్రం కంటి పక్కన ఒక మెటాలిక్ క్లిప్ ధరించి కనిపించింది. కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ అదే పరికరంతో సింధూ దర్శనమిచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్టార్ క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో సింధూ ధరించిన ఓ పరికరం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కింగ్ కోహ్లీ ఎప్పటిలాగే తనదైన ఆకర్షణతో ఉండగా, పీవీ సింధూ మాత్రం కంటి పక్కన ఒక మెటాలిక్ క్లిప్ ధరించి కనిపించింది. కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ అదే పరికరంతో సింధూ దర్శనమిచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

సింధూ ధరించిన "టెంపుల్" అని పిలిచే ఈ క్లిప్ ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తి రేపుతుంది. 'టెంపుల్' పరికరం సాధారణ స్మార్ట్‌వాచ్ లాంటిది కాదు. మెదడుకు వెళ్లే రక్త ప్రసరణను (Cerebral Blood Flow) రియల్-టైమ్‌లో పర్యవేక్షిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ఫోకస్‌ను పెంచడానికి ఇది సహాయ పడుతుందట. సింధూ నుదుటిపై పెట్టుకుంటే మెదడు పనితీరును ట్రాక్ చేస్తుంది. కంటి పక్కన పెట్టుకున ఒక మెటాలిక్ క్లిప్… ఫ్యూచర్ హెల్త్-టెక్ ట్రెండ్ గా మారనుందా?.. భవిష్యత్తు అంతా దీనిదేనా? అన్న చర్చను రేకెత్తించింది.

ఒకప్పుడు చేతికి స్మార్ట్‌వాచ్ పెట్టుకుంటే వింతగా చూసేవాళ్ళం, కానీ ఈరోజు అది మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. రాబోయే రోజుల్లో ఈ 'టెంపుల్' పరికరాల బాటలో నడిచే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసే ఐటీ నిపుణులు, క్రీడాకారులు, సీఈఓలు తమ మెదడు సామర్థ్యాన్ని (Brain Performance) పెంచుకోవడానికి 'టెంపుల్'పై ఆసక్తి చూపే ఛాన్స్ ఉందంటున్నారు.

హెల్త్‌పై కాన్సంట్రేట్ చేసే నేటి తరం, కేవలం హార్ట్ రేట్ మాత్రమే కాకుండా బ్రెయిన్ హెల్త్‌ను కూడా ట్రాక్ చేయడానికి 'టెంపుల్' వంటి సరికొత్త గ్యాడ్జెట్స్‌ వైపు అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వినూత్నమైన 'టెంపుల్' పరికరాన్ని ధరించి కనిపించగా… తాజాగా మన తెలుగు తేజం స్టార్ షట్లర్ కూడా ఇదే ధరించి కనిపించడం వెనుక ..ఆ పరికరం ప్రమోషన్ వ్యవహారం ఉండటం గమనార్హం.మార్కెట్లోకి వచ్చే ముందే భారీ హైప్ క్రియేట్ చేయడానికి, స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్‌లో దీని ఖచ్చితత్వాన్ని పరీక్షించడానికి పీవీ సింధు వంటి గ్లోబల్ ఐకాన్‌తో చేస్తున్న వ్యూహాత్మక ప్రమోషన్ ఇది అని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: VIDHATHA