Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డోర్నకల్-గద్వాల కొత్త రైల్వేలైన్ కోసం పాదయాత్ర చేస్తా

డోర్నకల్-గద్వాల కొత్త రైల్వేలైన్ కోసం పాదయాత్ర చేస్తా

వార్త 6 months ago

డోర్నకల్ గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తానని నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి(Mallu Ravi) ప్రకటించారు. గురువారం ఢిల్లీలో తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ వెనకబడ్డ ప్రాంతం అని, రైల్వే నెట్వర్క్ ఎంతో అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

కల్వకుర్తి- మాచర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగంగా ఉంటుందని వివరించారు. నేను మూడోసారి ఎంపి అయిన తర్వాత డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ గురించి ప్రతి పార్లమెంట్ సెషన్లో మాట్లాడుతూనే ఉన్నాను, రైల్వే మంత్రికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాను మన ముఖ్యమంత్రి ద్వారా రైల్వే మంత్రికి లేఖ రాయించా ఇలా అనేకసార్లు జరిగాయనీ తెలిపారు.

Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు

 Will do a padayatra for the new Dornakal-Gadwala railway line

నాగర్ కర్నూల్ పార్లమెంటు రైల్వే నెట్వర్క్తో కనెక్ట్

ఇటీవల కూడా రైల్వే మంత్రిని కూడా వ్యక్తిగతంగాకలిసి డోర్నకల్ గద్వాల్ రైల్వే లైన్ నాగర్ కర్నూలు జిల్లాకి లైఫ్ లైన్ లాంటిదని వివరించానని ఆయన తెలిపారు. ఈ లైన్ రావడం వల్ల నాగర్ కర్నూల్ పార్లమెంటు రైల్వే నెట్వర్క్తో కనెక్ట్ అవుతుందనీ, అభివృద్ధి చెందుతుందనీ ఈ లైన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్లోని కల్వకుర్తికి వచ్చి ఆ తర్వాత వనపర్తి నుంచి గద్వాలకి కనెక్ట్ అవుతుందని ఆయన రైలుమార్గం తీరును వివరించారు. ఇప్పడు ఇవాళ కూడా రైల్వే బోర్డు దగ్గరికి వెళ్ళి, రైల్వే బోర్డ్ డైరెక్టర్ అభిషేకన్ను కలిశాను ఈ రైల్వే లైన్ కోసం సర్వే చేసిన మ్యాప్ ని, సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే బోర్డు పంపించిన డిపిఆర్ ను తీసుకున్నానని ఆయన తెలిపారని చెప్పారు. వారం, పది రోజుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ట్రాఫిక్) ఇంకా మిగిలిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ మీటింగ్ పెట్టి పూర్తిస్థాయి డిపిఆర్ సిద్ధం చేసి కేబినెట్కు పంపించే ప్రక్రియను మొదలు పెడతామని రైల్వే బోర్డు డైరెక్టర్ చెప్పారు.

Mallu Ravi: ఈ ప్రాజెక్టుకు కూడా బడ్జెట్ మంజూరు

రైల్వే శాఖ మంత్రి, డైరెక్టర్, చైర్మన్ అందరితోనూ ఈ రైల్వే లైన్ ని బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ రాయల్ ప్లాంట్ కింద తీసుకోవాలని జనరల్ రాయల్ ప్లాన్ కింద తీసుకుంటే మళ్లీ దానికి రెవెన్యూ రిటర్న్స్ లేవనే ఇబ్బందులు వస్తాయనీ విన్నపం చేశానని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2.93 లక్షల కోట్లు బడ్జెట్ రైల్వే శాఖకు వచ్చింది. అందులో ఈ ప్రాజెక్టుకు కూడా బడ్జెట్ మంజూరు చేసి పనులు ఈ ఏడాదే. మొదలు పెట్టాలనేదే డిమాండ్ అని ఆయన చెప్పారు. కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల వరకు మరో లైన్ ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాలను కలుపుతుందని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రైల్వే లైన్లు ఏర్పాటు చేశారు. కానీ అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నాగర్కర్నూల్ జిల్లాకు మాత్రం రైల్వే లైన్ వేయలేదనీ ఈరోజు జీరో అవర్లో కూడా లోక్ సభలో మాట్లాడినాని ఆయన తెలిపారు..

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

బడంగ్ పేట్ మున్సిపాలిటీలో 122 కోట్లు పక్కదారి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha