Badangpet Municipality Corruption : గతేడాది డిసెంబర్ లో జీహెచ్ఎంసీలో విలీనమైన బడంగ్ పేట మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులపై వేటు పడింది.
డిప్యూటీ కమిషనర్ సహా 10 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుద్ధం, ఇంజినీరింగ్ పనుల్లో 122 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు. విలీనానికి ముందే రికార్డులు మాయం చేశారని, విధానపరమైన ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. కౌన్సిల్ ఆమోదం, ప్రత్యేక అధికారి అనుమతి లేకుండానే రెండేళ్లలో రూ.122 కోట్ల నిధులు పక్కదారి పట్టినట్లు సమాచారం.
Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు
122 crores misappropriated in Badangpet Municipality?
Badangpet Municipality Corruption: కమీషనర్ కఠిన చర్యలు
ప్రస్తుతం బడంగ్ పేట్ సర్కిల్-16 డిప్యూటీ కమీషనర్ గా పని చేస్తున్న పి.సరస్వతి, గతంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా పని చేసిన జి.రఘు (ప్రస్తుతం డిటిఅండ్సిపి బిల్డ్స్ సెల్), డిఇఇలు వెంకన్న, జ్యోతి, ఎ.యాదయ్య, ఎఇఇ వినీల్ కుమార్ గౌడ్, సానిటరీ ఇన్స్పెక్టర్ వంకాయల యాదగిరి, మేనేజర్/అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్లు జి. శ్రీధర్ రెడ్డి, డి. నాగేశ్వర్రావులతో పాటు స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్కు చెందిన ప్రీ ఆడిట్ ఆఫీసర్ ఎన్.వెంకట్లు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఇంజనీరింగ్, సానిటేషన్ పనుల్లో భారీ అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని విచారణ జరిపిన అధికారుల నివేదికలు అందడంతో కమీషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు.
పనులు చేయ కుండానే బిల్లులు, గతంలో చేసిన పనులకే మళ్ళీ టెండర్ నోటిఫికేషన్లు ఇవ్వడం, ఇష్టారాజ్యంగా అనుమతులు జారీ చేయడం తదితర ఆరోపణలపై ఎసిబి విచారణ చేసింది. ఆ తర్వాత జిహెచ్ఎంసి కమీషనర్ ఆదేశాల మేరకు రంగంలో దిగిన విజిలెన్స్ అధికారులు కొన్ని రోజుల పాటు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోనే మకాం వేసి రికార్డులు, ఫైళ్లు, ఎంబిలను క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. అయితే విచారణలో కొన్ని ముఖ్యమైన ఫైళ్లు కనిపించకపోవడంతో మాయం చేశారని సంగతిని గుర్తించారు. ఎట్టకేలకు విచారణ పూర్తి చేసిన అధికారులు నివేదికలు సమర్పించడంతో ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా కమీషనర్ సస్పెన్షన్ల వేటు వేశారు. సస్పెండ్కు గురైన అధికారుల్లో కొందరు బడంగ్ పేట్ సర్కిల్లో పని చేస్తుండడం మరి కొందరు వేరే చోట్ల పని చేస్తుండడం గమనార్హం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

