Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
15 ఏళ్లకు పెళ్లి.. 22 ఏళ్లకు ఐదుగురు పిల్లలు.. మరో మగబిడ్డ కావాలని..

15 ఏళ్లకు పెళ్లి.. 22 ఏళ్లకు ఐదుగురు పిల్లలు.. మరో మగబిడ్డ కావాలని..

ఇంటర్‌నెట్ డెస్క్: రాజస్థాన్‌కు చెందిన ఓ జంటకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. 22 ఏళ్లు వచ్చే సరికి ఆ జంట ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో నలుగురు అమ్మాయిలు కాగా..

ఓ అబ్బాయి ఉన్నాడు. ఇప్పటికే ఓ కొడుకు ఉండగా.. ఆ జంట మరో మగబిడ్డ కోసం తాపత్రయపడుతోంది. కొడుకు పుట్టే వరకు పిల్లలను కంటూనే ఉండాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ ఆరవ సారి గర్భం దాల్చింది. టెస్టుల కోసం ఆస్పత్రికి వెళ్లగా.. మహిళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న గైనకాలజిస్ట్ జంటపై సీరియస్ అయ్యారు.

చిన్న వయసులో ఎక్కువ సార్లు గర్భం దాల్చటం వల్ల ప్రాణాలుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మహిళ భర్త మాట్లాడుతూ.. 'మాకు ఒక్కడే కొడుకు ఉన్నాడు. మా కుటుంబాన్ని పోషించాలంటే ఒక్క కొడుకు సరిపోడు. మా వంశం కొనసాగాలన్నా కూడా ఇద్దరు కొడుకులు ఉండాల్సిందే' అని అన్నాడు. మహిళ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ అడిగి తెలుసుకున్నారు. సదరు మహిళకు ఊపిరి తీసుకోవటంలో సమస్యగా ఉంది. నీరసం, ఒళ్లు నొప్పులు, రక్త హీనత, పోషకాల లోపం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మహిళ సరైన గ్యాప్ లేకుండా పిల్లలు కంటోంది.

దీనిపై గైనకాలజిస్ట్ మహిళకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 'ఎక్కువ సార్లు గర్భం దాల్చి నువ్వు నీ ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకుంటున్నావు. వెంటవెంటనే పిల్లలకు జన్మనివ్వటం వల్ల నీకు, పుట్టబోయే బిడ్డకు ప్రమాదం' అని చెప్పారు. జంటతో జరిపిన సంభాషణ తాలూకా వీడియోను డాక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారంలోకి వస్తామని జగన్ అండ్ కో పగటి కలలు కంటున్నారు.. ధూళిపాళ్ల సెటైర్లు

రూపాయి వాస్తవిక విలువ కంటే తక్కువగా ట్రేడ్ అవుతోంది: ఆర్బీఐ గవర్నర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy