Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా క్రీడలు: లాంగ్ జంప్‌లో రజతం.. రన్నింగ్‌, డెకథ్లాన్‌లో కాంస్యాలు

ఆసియా క్రీడలు: లాంగ్ జంప్‌లో రజతం.. రన్నింగ్‌, డెకథ్లాన్‌లో కాంస్యాలు

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత్ ఎనిమిదో రోజు పతకాల వేట కొనసాగిస్తోంది. లాంగ్ జంప్‌లో యాన్సీ సోజన్‌కు రజతం దక్కింది. ఐదో జంప్ వరకూ సోజన్ ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది.

కానీ ఆరో జంప్‌లో చైనా అథ్లెట్ హుయాంగ్ యింగ్యింగ్ 6.55 మీటర్లు దూకి స్వర్ణ పతకం సాధించింది. 6.53 మీటర్లు దూకిన సోజన్ సిల్వర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూడో స్థానంలోనైనా నిలుస్తానని భావించిన షైలి సింగ్‌కు నిరాశే ఎదురైంది. 6.46 మీటర్లు దూకి నాలుగో స్థానంలో నిలివడంతో కాంస్యం చేజారింది.

హరిత రికార్డు

మహిళల 200 మీటర్ల రన్నింగ్ రేసులో భారత్ నుంచి ఇద్దరు ఫైనల్ వరకూ చేరుకున్న సంగతి తెలిసిందే. అందులో హరిత భద్ర మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. 200 మీటర్ల రేసును 23.20 సెకన్లలో పూర్తి చేసింది. కాగా మరో అథ్లెట్ ఉన్నతి అయ్యప్ప ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. సింగపూర్‌కు చెందిన పెరీరా శాంతి(22.78 సెకన్లు), చైనా అథ్లెట్(22.93 సెకన్లు) స్వర్ణ, రజత పతకాలను దక్కించుకున్నారు.

తేజస్విన్ శంకర్‌కు కాంస్యం

డెకథ్లాన్‌ పురుషుల ఈవెంట్‌లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్‌కు కాంస్యం దక్కింది. 1500 మీటర్ల రేసులో అతడు మూడో స్థానంలో నిలిచాడు. జపాన్‌కు చెందిన మరుయమ యుమ 8,123 పాయింట్లతో స్వర్ణం గెలిచాడు. చైనా అథ్లెట్ 8,012 పాయింట్లతో రజతం సంపాదించగా.. తేజస్విన్ 7,934 పాయింట్లతో కాంస్యం అందుకున్నాడు.

హైజంప్‌లో రజతం..

పురుషుల హైజంప్‌లో భారత అథ్లెట్ సర్వేశ్ కుషారే రజత పతకం సాధించాడు. 2.25 మీటర్ల ఎత్తుకు జంప్ చేసి రెండో స్థానంలో నిలిచాడు. తైవాన్‌కు చెందిన చావో సువాన్ కూడా ఇదే ఎత్తుకు జంప్ చేశాడు. కానీ తొలి ప్రయత్నంలోనే అతడు జంప్ చేయడంతో స్వర్ణం దక్కింది. మరో వైపు మహిళల 3వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్ పారుల్‌ చౌదరీ కాంస్య పతకం సాధించింది.

strong>

తొలి వన్డే: వెస్టిండీస్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy