Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆటను శాసించాడు

ఆటను శాసించాడు

లనాటి దిగ్గజం పీలే, తరువాతి తరం హీరో డీగో మారడోనా..ప్రస్తుత స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను కాదని లియోనెల్‌ మెస్సీయే సాకర్‌ 'ఆల్‌టైమ్‌ గ్రేట్‌' అనేందుకు లెక్కకు మిక్కిలి ఉదాహరణలున్నాయి..రెండు నెలల కిందట జరిగిన ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో మెస్సీ చేసిన మాయాజాలాన్ని మరువగలమా !

మెగా టోర్నమెంట్‌లో కెప్టెన్‌గా ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందించాడు..అల్జీరియాతో ఆరంభ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు..ఆస్ట్రియాపై రెండు గోల్స్‌తో అద్భుతం చేశాడు..మెగా టోర్నీలో అత్యధికంగా 18 గోల్స్‌తో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు..జోర్డాన్‌తో పోరులో కళ్లు చెదిరే ఫ్రీకిక్‌తో కొట్టిన గోల్‌ను ఏమని వర్ణించగలం ? ప్రీక్వార్టర్స్‌లో ఈజిప్టుతో, క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌తో, సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లలో జట్టును నడిపించి, గెలిపించిన తీరు మెస్సీకే చెల్లు..

అంతర్జాతీయ పోటీలలో ఇకపై లియోనెల్‌ మెస్సీ మెరుపులను చూడలేకపోవచ్చు. కానీ క్లబ్‌ సాకర్‌లో 39 ఏళ్ల అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ ఆటను కనులారా వీక్షించవచ్చు. రెండు దశాబ్దాల తన కెరీర్‌లో ఫుట్‌బాల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత మెస్సీది. స్వయంగా గోల్స్‌ కొట్టడంలో ఎంత మేటో..సహచరులు గోల్స్‌ సాధించేలా అవకాశాలు సృష్టించడంలో మెస్సీ అంతకు మించిన మొనగాడు. ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఊపేసిన మెస్సీ..అసలు సాకర్‌కే పనికిరాడని స్వస్థలం రొసారియో కోచ్‌లు పొమ్మన్నారు. 'పొట్టిగా ఉన్నావు. ఈ ఆటకేం సరిపోతావు' అని ఎద్దేవా చేశారు. పైగా..11 ఏళ్ల వయసులో హార్మోన్‌ ఎదుగుదల లోపం బయటపడడం మెస్సీకి ప్రతికూలమైంది. కానీ అమ్మమ్మ సెలియా ఒలివేరాకు మనవడు మెస్సీ ప్రతిభపై ఎనలేని నమ్మకం. ఆ విశ్వాసంతో కోచ్‌లను ఒప్పించి మనవడికి శిక్షణ ఇప్పించింది. ఈ తరుణంలో అమ్మమ్మ మరణించడం అతడిని తీరని విషాదంలోకి నెట్టింది. అయితే తనను గొప్ప సాకర్‌ ఆటగాడిగా చూడాలన్న అమ్మమ్మ స్వప్నం నెరవేర్చే లక్ష్యంతో మెస్సీ ఆ విషాదాన్ని దిగమింగాడు. లియోనెల్‌ సాకర్‌ స్టార్‌గా ఎదగడంలో బార్సిలోనా క్లబ్‌ది కీలక పాత్ర. మిగతా క్లబ్‌లన్నీ నో చెప్పిన వేళ..మెస్సీని తమ క్లబ్‌లో చేర్చుకొని అతడి అనారోగ్యానికి చికిత్స ఇప్పించడంతోపాటు సాకర్‌ ప్లేయర్‌గా తీర్చిదిద్దింది. 2004లో 17 ఏళ్ల వయస్సులో బార్సిలోనా తరపున పోటీ సాకర్‌లోకి అడుగుపెట్టిన మెస్సీ, 2005లో హంగేరి జట్టుపై అర్జెంటీనాకు అరంగేట్రం చేశాడు. ఆపై ప్రపంచ ఫుట్‌బాల్‌ పై చెరగని ముద్ర వేశాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

trong>

ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్

రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy