Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ 2026: పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఇలా!

ఐపీఎల్ 2026: పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఇలా!

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. నాలుగో స్థానం కోసం పోటీ తీవ్రతరమైంది.

రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ఒక్క ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్.. అనూహ్యంగా గాడీ తప్పింది. వరుసగా ఏడు విజయాల తర్వాత ఆడిన అన్నింట్లోనూ ఓడి.. ప్లే ఆఫ్స్ బెర్తు కోసం శ్రమిస్తోంది. నేడు పంజాబ్.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో చావో రేవో మ్యాచ్ ఆడనుంది. మరి పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ.. భవిష్యత్తు మాత్రం వారి చేతుల్లో లేదు. ఫస్ట్ పంజాబ్ చేయాల్సిన పని ఏంటంటే.. నేడు లఖ్‌నవూతో జరిగే పోరులో తప్పక గెలవాలి. అప్పుడు తాత్కాలికంగా నాలుగో స్థానానికి చేరుతుంది. అయితే అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవాలి. రాజస్థాన్ ప్రస్తుతం 14 పాయింట్లతో పంజాబ్ కంటే ముందుంది. ముంబై ఇండియన్స్‌పై జరిగే పోరులో ఆర్ఆర్ ఓడితే పంజాబ్‌కు మార్గం సుగమనమవుతుంది.

మరో ట్విస్ట్..

లఖ్‌నవూపై పంజాబ్ కింగ్స్ గెలిచి.. ముంబైపై ఆర్ఆర్ ఓడినా కోల్‌కతా రూపంలో పంజాబ్‌కు ముప్పు పొంచి ఉంది. కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే నెట్‌రన్ రేట్ కారణంగా పంజాబ్‌కు షాక్ తగిలే అవకాశం ఉంది. ఉదాహరణకు పంజాబ్ కేవలం ఒక్క పరుగుతో లఖ్‌నవూపై గెలిస్తే.. కేకేఆర్ దాదాపు 52 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇది సాధ్యపడదు. కానీ ఇన్ని ట్విస్టులు ఇచ్చిన ఐపీఎల్ 2026లో ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లనుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy