ఇంటర్నెట్ డెస్క్: అమెజాన్ రిటర్న్ పాలసీని దుర్వినియోగం చేసి ఓ వ్యక్తి ముంబైకి చెందిన వ్యాపారిని రూ.16.28 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఘట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 60 ఏళ్ల బాధితుడు గత ఐదేళ్లుగా అమెజాన్‌లో వ్యాపారం చేస్తున్నారు. 2025 జూన్ 20 నుంచి 2026 ఆగస్టు 13 మధ్య చేసిన పలు ఆర్డర్ల ద్వారా ఈ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడు మొత్తం 62 ఖరీదైన గ్యాడ్జెట్లను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. వాటిని డెలివరీ తీసుకున్న తర్వాత రిటర్న్ చేసేవాడు. అయితే అసలు వస్తువులకు బదులుగా పనికిరాని వస్తువులను బాక్సుల్లో పెట్టి అమెజాన్‌కు పంపించేవాడు. ఆ తర్వాత వాటికి పూర్తి రీఫండ్ పొందేవాడు.
ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఎయిర్‌పాడ్స్ ప్రో 3, డీజేఐ ఓస్మో యాక్షన్ 6 అడ్వెంచర్ కాంబో, సోనీ పీఎస్5 గేమింగ్ కిట్, రే-బాన్ వేఫేరర్ గ్లాసెస్, గిగాబైట్ జిఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5090 గ్రాఫిక్స్ కార్డులు, టైటాన్ వాచీలు వంటి ఖరీదైన వస్తువులను తీసుకున్న నిందితుడు.. వాటి స్థానంలో పనికిరాని వస్తువులను పెట్టి రిటర్న్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బర్క్‌షైర్ హ్యాథవే చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న వారెన్ బఫెట్

