Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ ప్యాకేజీ.. 40 వేల భారీ బాంబుల సరఫరా..

అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ ప్యాకేజీ.. 40 వేల భారీ బాంబుల సరఫరా..

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌కు మరో భారీ ఆయుధ ప్యాకేజీని అందించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. సుమారు 2.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.26 వేల కోట్లు) విలువైన ఈ ఆయుధ ఒప్పందంలో 40,000 భారీ బాంబులు ఉండనున్నట్లు సమాచారం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ ఆయుధ విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి (US Israel arms deal).

ప్రతిపాదిత ప్యాకేజీలో ఒక్కోటి టన్ను బరువుండే 20,000 ఎంకే-84 బాంబులు, 20,000 బీఎల్‌యూ-117 బాంబులు, 20,000 ఐ-2000 పెనిట్రేటర్ వార్‌హెడ్లు ఉన్నట్లు 'వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది. ఎంకే-84 వంటి అత్యంత శక్తివంతమైన బాంబులు భూగర్భ లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడతాయి. మిగిలినవి భూమి ఉపరితలంపై అత్యధిక విస్తీర్ణంలో పేలుడు ప్రభావాన్ని కలిగించేందుకు ఉపయోగపడతాయి (Trump Israel weapons deal).

ఈ ఒప్పందంలో ఎక్కువ భాగం ఫారిన్ మిలిటరీ ఫైనాన్సింగ్ విధానం ద్వారా నిధులు సమకూరనున్నట్లు వార్తా సంస్థలు తెలిపాయి. అంటే అమెరికా ప్రభుత్వం అందించే నిధులతో అమెరికా నుంచి ఇజ్రాయెల్ ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. అంటే అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులతోనే ఈ కొనుగోలు జరుగుతోంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం గురించి అమెరికా కాంగ్రెస్‌లోని సంబంధిత కమిటీలకు అనధికారికంగా సమాచారం అందినట్లు 'రాయిటర్స్' తెలిపింది (40000 bombs Israel).

గాజాలో పౌరుల ప్రాణనష్టంపై ఆందోళనల నేపథ్యంలో 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం భారీ బాంబుల రవాణాను నిలిపివేసింది (US weapons to Israel). అయితే ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆంక్షలను తొలగించారు. కాగా, తాజా ఒప్పందం తుది ఆమోదం, ఆయుధాల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.


ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy