అమరావతి, మే11 (ఆంధ్రజ్యోతి): ప్రార్థనా స్థలాల్లో అనధికార లౌడ్‌స్పీకర్లపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishna Raju) ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి రఘురామ ఈరోజు (సోమవారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. శబ్దకాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రార్థనా స్థలాల్లో అధిక శబ్దంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లౌడ్‌స్పీకర్లతో విద్యార్థులు, వృద్ధులు, రోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని రఘురామ వ్యాఖ్యానించారు. ఏడాదిలో గరిష్ఠంగా 15 రోజులు మాత్రమే లౌడ్‌స్పీకర్లకు అనుమతి ఉందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనధికార సౌండ్ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. నివాస ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా నిబంధనలు అమలు చేయాలని రఘురామ కోరారు.
.
మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు
జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం
కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News

