నెల్లూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం పురాతనమైన, పవిత్రమైన ఆలయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలకు భద్రత కొరవడిందని..
విధ్వంసాలు సృష్టించారని ధ్వజమెత్తారు. ఈరోజు (ఆదివారం) నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు.
వైసీపీ హయాంలో సనాతన ఆచార వ్యవహారాలను, ధర్మాలను అపహాస్యం చేశారని మంత్రి ఆనం ఆగ్రహించారు. భక్తులు ఆలయాలకు వెళ్లటమే మానేసేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని అన్నారు. 700 ఆలయాలను రూ.823 కోట్లతో పునరుద్ధరిస్తున్నామని చెప్పుకొచ్చారు. రూ.750 కోట్లతో రాష్ట్రంలో ఐదువేల భజన మందిరాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. రూ.113 కోట్లతో 617 భజన మందిరాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
వైసీపీ హయాంలో దేవాలయాల వ్యవస్థను సర్వనాశనం చేశారు: మంత్రి నారాయణ

నెల్లూరు సిటీలోని ఐదు ఆలయాల అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ హయాంలో దేవాలయాల వ్యవస్థను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. రూ.10 వేలు ఆలయాలకు ధూప, దీప నైవేద్యాలకు నిధులు కేటాయించిన ఘనత సీఎం చంద్రబాబుది అని వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
.
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News

