Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తమ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) రావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) , మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) భావోద్వేగంగా స్పందించారు.

సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పోస్టు చేస్తూ ప్రధాని పర్యటనను ప్రత్యేకమైన సందర్భంగా వారు అభివర్ణించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

ప్రధానితో సమావేశం... మాకెంతో ప్రత్యేకం..

తమ కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని, ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రం ఇదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రోజు తమ నివాసంలో ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు లభించిన గొప్ప గౌరవం, సంతోషమని చెప్పుకొచ్చారు. ఆప్యాయత, అనురాగంతో ప్రధాని తమతో గడిపిన ఈ సందర్భం తమ అందరికీ ఎంతో ప్రత్యేకమని వ్యాఖ్యానించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మోదీ అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి, మద్దతుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు.

మోదీని మా ఇంటికి స్వాగతించడం గొప్ప విశేషం: మంత్రి నారా లోకేశ్

ఈరోజు హైదరాబాద్‌లోని తమ ఇంటికి ప్రధాని మోదీని స్వాగతించడం గొప్ప విశేషమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. మోదీ తమ కుటుంబానికి అందించిన ఆప్యాయత, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబంలోని మూడు తరాలు ప్రధానితో కలిసి ఉండటం ముఖ్యంగా గుర్తుండి పోయే మధుర జ్ఞాపకమని చెప్పుకొచ్చారు. మోదీ.. తన కుమారుడు నారా దేవన్ష్‌ను ఆశీర్వదించడం నిజంగా గొప్ప అదృష్టమని తెలిపారు. ఎప్పటిలాగే, తాను దేశంపై ఆయన అచంచలమైన నిబద్ధతతో ప్రేరణ పొందానని అన్నారు. ప్రజల సేవలో మరింత కష్టపడి తాను పనిచేయడానికి మోదీ నుంచి స్పూర్తి పొందానని తెలిపారు. ఇలాంటి క్షణాలు జీవితాంతం ఎంతో గుర్తుండి పోతాయని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy