ఇంటర్‌నెట్ డెస్క్: ఐఫోన్ 18 ప్రో భారత్‌లో అమ్మకానికి వచ్చింది. కొత్త ఐఫోన్ కోసం కొనుగోలుదారులు ఉత్సాహం చూపుతున్నారు. యాపిల్ స్టోర్లు తెరవకముందే పెద్ద సంఖ్యలో స్టోర్ల ఎదుట క్యూల్లో నిల్చున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ నొయిడాలోని డీఎల్‌ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలో ఉన్న యాపిల్ స్టోర్ వద్ద ఉదయం 8 గంటలకే భారీ క్యూ కనిపించింది. అక్కడ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనడానికి వచ్చినట్లు తెలిపాడు. తనకు బర్గండీ రంగు ఐఫోన్ 18 ప్రో కావాలని భార్య చెప్పడంతో కొనడానికి వచ్చినట్లు అతను వివరించాడు. ఆమె ఇంతకుముందు ఐఫోన్ ఉపయోగించలేదని, అందుకే ఆమెకు కొత్త ఫోన్‌ను బహుమతిగా ఇవ్వాలనుకున్నానని చెప్పాడు. భవిష్యత్తులో డబ్బు ఉంటుందో ఉండదో.. అందుకే ఐఫోన్ 18 ప్రో ఫోన్ కొనుగోలు కోసం తాను బంగారం అమ్మినట్లు ఆ వ్యక్తి వెల్లడించాడు.
తన వద్ద గతంలో డబ్బు లేదని, ప్రస్తుతం డబ్బు ఉండటంతో తన భార్యకు నచ్చిన ఫోన్ కొనివ్వాలని నిర్ణయించుకున్నానని వివరించాడు. 'ఇప్పుడు నా వద్ద డబ్బు ఉంది. భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు. అందుకే ఇప్పుడే ఆ ఫోన్ కొనాలని నిశ్చయించుకున్నా' అని తెలిపాడు.
ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్‌పాల్ సింగ్
పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..

