Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగ్లాదేశ్ అత్యంత సురక్షితం దేశం: తమీమ్‌ ఇక్బాల్

బంగ్లాదేశ్ అత్యంత సురక్షితం దేశం: తమీమ్‌ ఇక్బాల్

స్పోర్ట్స్ డెస్క్‌: బంగ్లాదేశ్ లో భారత జట్టు పర్యటనపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం గతేడాది ఆగస్టులోనే 3 వన్డేలు, 3 టీ20లను ఆడేందుకు టీమిండియా వెళ్లాల్సి ఉంది.

అయితే సమయంలో బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాడు జరగాల్సిన సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌కు వాయిదా వేస్తూ అప్పుడు నిర్ణయం తీసుకున్నారు.

బంగ్లాదేశ్‌లో భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉద్దేశంతో తాజాగా బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ అత్యంత సురక్షితమైన దేశమని, భారత్‌ తప్పకుండా తమ దేశానికి వస్తుందనే నమ్మకం ఉందని ఇక్భాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

'భారత్‌తో సిరీస్‌ జరుగుతుందా లేదా అనే విషయం గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ, తప్పకుండా ఆ జట్టు బంగ్లాలో పర్యటిస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పటికే భారతక్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. భారత్ - బంగ్లా మధ్య సిరీస్‌ ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నా. భద్రతపరంగా బంగ్లాదేశ్ అత్యంత సురక్షితమైన దేశం. ఇక్కడ వారికి ఎలాంటి ముప్పు ఉండదు. మా వైపు నుంచి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాం' అని తమీమ్‌ స్పష్టం చేశారు.

భారత్ చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్‌లో మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం పర్యటించింది. ఆ సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోగా, భారత్ పుంజుకుని టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ ప్రస్తుతం శ్రీలంకలో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతుండగా, బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

strong>

భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా

భారత హాకీకి కొత్త జెర్సీ.. హెచ్‌ఐ నిర్ణయంపై మాజీ కెప్టెన్ అసంతృప్తి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy