Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా

భారత హాకీ జెర్సీ మార్పుపై వివాదం.. వివరణ ఇచ్చిన హాకీ ఇండియా

స్పోర్ట్స్ డెస్క్: వచ్చే నెల బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా జరగనున్న ఎఫ్‌ఐహెచ్ (FIH) పురుషుల, మహిళల హాకీ ప్రపంచకప్‌లకు సంబంధించి భారత జట్ల కొత్త జెర్సీల అంశం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ నీలం రంగు స్థానంలో కాషాయం రంగు జెర్సీలను ఆవిష్కరించడంపై మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హాతో పాటు అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ వివాదంపై స్పందించిన హాకీ ఇండియా గురువారం (జులై 30) ఒక ప్రకటన విడుదల చేసింది. జెర్సీ మార్పు వెనుక ఉన్న సాంకేతిక కారణాలను స్పష్టం చేసింది.

అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు జరిగే బ్లూ సింథటిక్ (టర్ఫ్) మైదానాల్లో ఆటగాళ్లు నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల దృశ్యం సరిగా ఉండటం లేదని హాకీ ఇండియా తెలిపింది. మైదానం రంగు, కిట్ రంగు కలిసిపోవడం వల్ల ఆటగాళ్ల స్పష్టత(On-field clarity) లోపిస్తోందని మైదానంలో కోచ్‌లు, ఆటగాళ్లతో పాటు సహాయక బృందం నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని పేర్కొంది. కేవలం ఆటగాళ్ల పనితీరును మెరుగుపరచడానికి, సాంకేతిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అంతేకాకుండా, కాషాయ రంగు మన జాతీయ జెండాలోని మూడు రంగులలో ఒకటి కావడమే కాక, శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుందని స్పష్టం చేసింది.

గతంలో కూడా జట్టు జెర్సీ రంగులు మారిన దాఖలాలు ఉన్నాయని హాకీ ఇండియా ఈ సందర్భంగా గుర్తుచేసింది. 2014 ప్రపంచకప్‌లో భారత జట్టు పసుపు (Yellow) రంగు జెర్సీలో ఆడగా, 2018 ప్రపంచకప్‌లో స్కై బ్లూ విభిన్నమైన డిజైన్‌తో వచ్చిందని తెలిపింది. మరోవైపు, భారత మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా తన పోస్ట్‌ను అనవసరంగా రాజకీయం చేస్తున్నారని కూడా విమర్శించాడు. 'జెర్సీ రంగు మార్పుపై చాలా అనవసరమైన రాజకీయ వ్యాఖ్యలు చూస్తున్నాను. నేను జోలికి వెళ్లాలనుకోవడం లేదు.హెచ్ఏకు చాలా విన్రమంగా నా అభిప్రాయాలను తెలియజేశాను. ఫుట్‌బాల్‌కు అర్జెంటీనా ఎలాగో, హాకీకి భారతదేశం కూడా అంతే' అని వీరేన్ పేర్కొన్నాడు. మొత్తంగా హాకీ ఇండియా నుంచి క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ జెర్సీ రగడకు తెరపడినట్లయింది.

strong>

చేయి కోల్పోయి... 'స్వర్ణం'తో మెరిసిన పారా అథ్లెట్ దిలీప్!

భారత హాకీకి కొత్త జెర్సీ.. హెచ్‌ఐ నిర్ణయంపై మాజీ కెప్టెన్ అసంతృప్తి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy