Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేయి కోల్పోయి...  'స్వర్ణం'తో మెరిసిన పారా అథ్లెట్ దిలీప్!

చేయి కోల్పోయి... 'స్వర్ణం'తో మెరిసిన పారా అథ్లెట్ దిలీప్!

స్పోర్ట్స్ డెస్క్: ప్రతి ఒక్కరికి జీవితంలో ఉన్నతస్థితికి చేరాలనే కోరిక ఉంటుంది. లక్ష్యం చేరే సమయంలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కొందరు మధ్యలోనే ఆగిపోతారు.

మరికొందరు మాత్రం అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుని అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటారు. కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో 'స్వర్ణం'తో మెరిసిన పారా అథ్లెట్ దిలీప్ గవిత్ (Dilip Gavit) 'స్ఫూర్తిదాయకమైన' స్టోరీ కూడా ఇలాంటిదే.

కామన్వెల్త్ గేమ్స్‌2026లో.. 100 మీటర్ల టీ47 పోటీల్లో 10.71 సెకన్లతో గవిత్‌ పసిడి పతకం అందుకున్నాడు. సాధారణంగా రేసును పూర్తి చేసిన తర్వాత అథ్లెట్లు సంబరాలు చేసుకుంటారు. అలానే ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇస్తుంటారు. కానీ గవిత్ మాత్రం అందుకు భిన్నంగా ఓ వ్యక్తి కోసం వెతికాడు. ఆ వ్యక్తి కనిపించగానే చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేశాడు. గవిత్ కళ్లు వెతికిన వ్యక్తి వైద్యనాథ్‌ కాలే. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో దిలీప్‌కు ఆశ్రయం కల్పించి.. శిక్షణ ఇప్పించాడు. డబ్బుల్లేక సరిగ్గా భోజనమే చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఈ అథ్లెట్‌కు 11 ఏళ్ల వయసులోనే ఆశ్రయం కల్పించిన వైద్యనాథ్ కోచ్‌ కమ్ టీచర్‌గా మారారు.

'ఆయన నాకు గురువు కంటే ఎక్కువ. ఆయన ఇంట్లోనే ఉన్నా, వారి టేబుల్ మీదనే తిన్నా. ఆయన ఓ కొడుకులా నన్ను పెంచారు. అన్నం పెట్టి, శిక్షణ ఇప్పించి.. చదువు నేర్పించారు. ఇప్పుడు నేను ఇలా ఉండటానికి కారణం ఆయనే. జీవితాంతం రుణపడి ఉంటా' అని కోచ్‌ వైద్యనాథ్ గురించి చెబుతూ గవిత్ భావోద్వేగానికి గురయ్యాడు. అలానే వైద్యనాథ్ కాలే (Vaijnath Kale) కూడా దిలిప్ గురించి మాట్లాడుతూ.. ' నేను దిలిప్‪ను దత్తత తీసుకున్నా. నా ఇంటిపేరు ఇవ్వలేకపోయినా.. అతడు నా బిడ్డనే' అని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని తొరన్‌డోంగ్రి గ్రామంలో దిలీప్‌ గవిత్ జన్మించాడు. చిన్నప్పుడే ప్రమాదవశాత్తూ పడిపోవడంతో కుడి చేయి తీవ్రంగా దెబ్బతింది. స్థానికంగా ఉండే ఆయుర్వేద వైద్యుడి అరకొర చికిత్స కారణంగా గవిత్‌.. తన చేయి కోల్పోయాడు. రానురాను కుటుంబానికి అతడు భారంగా మారాడు. మరోవైపు సొంత భూమి ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం చేయడం కష్టంగా మారేది. దీంతో కుటుంబ సభ్యులు కూలీలుగా మారింది. చేయి లేకపోవడంతో గవిత్‌ పనిచేయలేకపోయేవాడు.

strong>

భారత హాకీకి కొత్త జెర్సీ.. హెచ్‌ఐ నిర్ణయంపై మాజీ కెప్టెన్ అసంతృప్తి!

ఏ బౌలర్‌కి భయపడతావు?.. వైభవ్ సింగిల్ లైన్ ఆన్సర్ వైరల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy