Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్

బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఓటు చోరీ చేసి ప్రజలను మోసం చేసిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. నిస్సదేహంగా రాహుల్ ప్రధాని కానున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు (ఆదివారం) సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి ఉత్తమ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.

పేదలకు మంచి క్వాలిటీ సన్నబియ్యాన్ని అందిస్తున్నాం..

పేదలకు మంచి క్వాలిటీ సన్నబియ్యాన్ని తాము అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో దేనికి పనికిరాని దొడ్డు బియ్యం అందించారని.. వాటిని అందరూ అమ్ముకునేవారని అన్నారు. దేశంలో చాలా చోట్ల బీజేపీ అధికారంలో ఉందని.. కానీ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యాన్ని కాంగ్రెస్ మాత్రమే అందిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో 90 శాతం మంది పేదలు సన్నబియ్యం తింటున్నారని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..

బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లాలో మూడు లక్షలపై చిలుకు కొత్త కార్డులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. పది లక్షల మంది సన్నబియ్యం తీసుకుంటున్నారని వెల్లడించారు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తవి లక్ష పైచిలుకు కార్డులు అందించామని తెలిపారు. దీని ద్వారా మూడు లక్షల మంది లబ్ధి పొందుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. పోలీసులకు సీపీ సజ్జనార్ అభినందనలు

తెలంగాణ తెగువకు నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ: కేసీఆర్

దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడం సరికాదు: ఎమ్మెల్యే సంజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy