Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెస్ ఒలింపియాడ్: భారత్ ఖాతాలో రెండు పతకాలు

చెస్ ఒలింపియాడ్: భారత్ ఖాతాలో రెండు పతకాలు

ఇంటర్నెట్ డెస్క్: చెస్‌ ఒలింపియాడ్‌-2026లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. పురుషుల జట్టు రజత పతకం సాధించగా.. మహిళల జట్టు కాంస్యంతో మెరిసింది. ఆదివారం ముగిసిన 46వ చెస్‌ ఒలింపియాడ్‌లో హంగేరీతో జరిగిన చివరి రౌండ్‌లో భారత పురుషుల జట్టు 2-2తో డ్రా చేసుకుంది.

దీంతో మొత్తం 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. టైబ్రేక్‌లో మెరుగైన స్కోరు సాధించడంతో భారత్‌కు రజతం దక్కింది. ఇదే పాయింట్లతో ఉన్న జర్మనీ కాంస్యంతో సరిపెట్టుకుంది.

ఓపెన్‌ విభాగంలో ఉజ్బెకిస్థాన్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. చివరి రౌండ్‌లో ఉక్రెయిన్‌పై 2.5-1.5తో విజయం సాధించిన ఉజ్బెకిస్థాన్ జట్టు మొత్తం 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 11 రౌండ్లలో 10 విజయాలు సాధించిన ఆ జట్టు.. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే జర్మనీ చేతిలో ఓడింది.

గుకేశ్‌కు షాక్‌.. ప్రజ్ఞానందకు కాంస్యం

చివరి రౌండ్‌లో హంగేరీతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్‌ ఆర్‌. ప్రజ్ఞానంద రిచర్డ్‌ రాపోర్ట్‌తో డ్రా చేసుకున్నాడు. అర్జున్‌ ఎరిగైసీ పీటర్‌ లెకోపై విజయం సాధించాడు. నిహాల్‌ సరీన్‌, బెంజమిన్‌ గ్లెడురాతో డ్రా చేసుకున్నాడు. అయితే డి. గుకేశ్‌ గ్లెబ్‌ డుడిన్‌ చేతిలో ఓడిపోయాడు. చివరి రౌండ్‌లో గుకేశ్‌ పరాజయం కారణంగా వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడు. మరోవైపు ప్రజ్ఞానంద తన ప్రదర్శనతో వ్యక్తిగత కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

మహిళల జట్టుకు కాంస్యం

మహిళల విభాగంలో భారత్‌ కాంస్య పతకాన్ని సాధించింది. చివరి రౌండ్‌లో జార్జియాతో 2-2తో డ్రా చేసుకున్న భారత జట్టు మొత్తం 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ తరఫున కోనేరు హంపి నానా డ్జాగ్నిడ్జేపై విజయం సాధించింది. అయితే నాలుగో బోర్డులో దివ్య దేశ్‌ముఖ్‌.. బెల్లా ఖొటెనాష్విలి చేతిలో ఓడింది. వంతిక అగర్వాల్‌ లెలా జవాఖిష్విలితో డ్రా చేసుకుంది. మరోవైపు బి. సవిత శ్రీ మెరీ అరబిడ్జేతో డ్రా చేసుకుంది. భారత మహిళల కాంస్య పతకంలో సవిత శ్రీ కీలక పాత్ర పోషించింది. మొత్తం 10 గేముల్లో 9 పాయింట్లు సాధించిన ఆమె.. జట్టుకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. జార్జియాతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ క్లిష్ట పరిస్థితుల్లో పోరాడి డ్రా సాధించింది.

వ్యక్తిగత విభాగంలోనూ పతకాల పంట

జట్టు కాంస్యంతో పాటు సవిత శ్రీ వ్యక్తిగత ప్రదర్శనకు స్వర్ణ పతకం సాధించింది. కోనేరు హంపి, వంతిక అగర్వాల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాలు దక్కించుకున్నారు. దివ్య దేశ్‌ముఖ్‌ రజత పతకం సాధించింది. పురుషుల విభాగంలో ప్రజ్ఞానంద వ్యక్తిగత కాంస్యంతో మెరిశాడు. అయితే చివరి రౌండ్‌లో గుకేశ్‌ ఓటమి కారణంగా వ్యక్తిగత స్వర్ణ పతకం అతడి చేజారిపోయింది.

strong>

తొలి వన్డే: వెస్టిండీస్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy