హైదరాబాద్, ఆగస్టు 06: హైదరాబాద్లోని దోమలగుడ గోశాల సమీపంలో చెత్తకుప్పలో కాలిపోతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు వారు సమాచారం అందించారు. వారంతా అక్కడికి చేరుకుని.. మంటలను అదుపు చేశారు. అనంతరం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోశాల సమీపంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా అతడిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇక్కడ పడేశారా?, ఆధారాలు లేకుండా ఉండేందుకు ఆ మృతదేహాన్ని చెత్తకుప్పలో వేసి తగలబెడుతున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత.. అతడి మృతిపై మరింత స్పష్టం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
మద్యం మత్తులో మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు.. యువతి పరిస్థితి విషమం

