Dailyhunt
డీఎంకే జాబితా విడుదల.. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ పోటీ

డీఎంకే జాబితా విడుదల.. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ పోటీ

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 164 మంది అభ్యర్థుల జాబితాను డీఎంకే (DMK) శనివారంనాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి కొలతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చెపాక్-ట్రిప్లికేన్ నుంచి, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji) కోయంబత్తూరు సౌత్ నుంచి, ఓ పన్నీర్ సెల్వం (O Panneerselvam) బోడినాయక్కనూరు నుంచి పోటీ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సెక్యూలర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ (ఎస్‌పీఏ)కు డీఎంకే సారథ్యం వహిస్తోంది. సీట్ల ఒప్పందంలో భాగంగా 234 స్థానాలకు గాను డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎంకే భాగస్వామ్య కాంగ్రెస్ పార్టీ పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవాంకోడె, శివకాశీ, కారైకుడి సహా 28 సీట్లలో పోటీ చేస్తోంది. ప్రేమలత విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకేకు 10 సీట్లు కేటాయించారు. విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) 8 సీట్లలో పోటీ చేస్తోంది. సీపీఐ, సీఎంలు చెరో 5 సీట్లలో పోటీ చేస్తున్నాయి. వైకో సారథ్యంలోని ఎండీఎంకే 4 స్థానాల్లో పోటీ చేయనుంది.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న ఒకే విడతలో జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy