Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ 4 రాశులపై వినాయకుడి కటాక్షం.. కెరీర్, వ్యాపారంలో ఇక విజయాలే!

ఈ 4 రాశులపై వినాయకుడి కటాక్షం.. కెరీర్, వ్యాపారంలో ఇక విజయాలే!

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా గణపతి నామస్మరణలు, భక్తి గీతాలతో పండుగ వాతావరణం నెలకొంది.

వినాయక చవితి 2026 సందర్భంగా కొన్ని రాశుల వారికి గణేశుడి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. గణేశుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి ఎదురవుతున్న కొన్ని సమస్యలు తగ్గడంతో పాటు కెరీర్, వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

కన్యా రాశి:

కన్యా రాశి వారికి వినాయక చవితి సందర్భంగా కొత్త అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధించడంతో పాటు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. సామాజికంగా కూడా గుర్తింపు పెరగవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

మిథున రాశి:

మిథున రాశి వారికి వినాయక చవితి మంచి అవకాశాలను తీసుకురావచ్చు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి అనుకూల సమయం కావచ్చు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. అలాగే వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగి, మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కుంభరాశి:

కుంభ రాశి వారికి వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడటంతో పాటు మంచి అవకాశాలు లభించవచ్చు. పెద్ద ఒప్పందం కుదిరి లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు రావచ్చు. కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు.

మకరరాశి:

గణేశ చతుర్థి సమయంలో మకర రాశి వారికి ఎదురవుతున్న కొన్ని అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. వ్యాపారంలో లాభాలు రావడంతో పాటు వృత్తిపరంగా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి.

Note: ఇందులోని సమాచారం జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగామీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

అమెరికా ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వానికి గణనాథుడు సద్బుద్ధిని ప్రసాదించాలి: టీ బీజేపీ చీఫ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy