Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తాం: మంత్రి దుర్గేశ్

ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తాం: మంత్రి దుర్గేశ్

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గడిచిన రెండున్నరేళ్లలో రూ.20000 కోట్ల పర్యాటక పెట్టుబడును ఆకర్షించామని, దాదాపు రూ.10వేల కోట్లు గ్రౌండింగ్ చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) వ్యాఖ్యానించారు.

సీఐఐ సదస్సులో ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ (CII) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు మంత్రి కందుల దుర్గేశ్ ఈరోజు (గురువారం) హాజరయ్యారు. ఈ సదస్సు వేదిక వద్ద మంత్రి దుర్గేశ్‌కు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం..

పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం అత్యంత కీలకమైన ఆదాయ వనరుగా మారనుందని వివరించారు. యువతకు ఉపాధి కల్పన, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగాన్ని 'గ్రోత్ ఇంజిన్'గా మారుస్తామని కందుల దుర్గేశ్ ఉద్ఘాటించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు

తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి

పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy